టాలీవుడ్ ప్రముఖులకు నిన్న రాత్రి గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు దిల్ రాజు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరికీ పార్టీలు ఇవ్వలేదు . ప్యాండమిక్ కావడంతో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు. దాంతో నిన్న నైట్ సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ తో తన 50వ బర్త్ డే సంబరాలు జరుపుకున్న దిల్ రాజు… ఇక ఫ్యామిలీతో పర్సనల్ గా సెలెబ్రేషన్స్ జరుపుకోవటానికి సిద్దపడ్డారు. భార్య వైగా రెడ్డితో కలిసి ఈ రోజు ఆయన గోవాకి వెళ్లారు. అక్కడే ఇక సెలెబ్రేషన్స్ ఊపందుకోనున్నాయి.
ఈ రోజు (డిసెంబర్ 18న) దిల్ రాజు పుట్టిన రోజు. 50వ ఒడిలోకి అడుగు పెడుతున్నాడు ఈ నిర్మాత. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులకు నిన్న రాత్రి గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు దిల్ రాజు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరికీ పార్టీలు ఇవ్వలేదు . ప్యాండమిక్ కావడంతో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు. దాంతో నిన్న నైట్ సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ తో తన 50వ బర్త్ డే సంబరాలు జరుపుకున్న దిల్ రాజు… ఇక ఫ్యామిలీతో పర్సనల్ గా సెలెబ్రేషన్స్ జరుపుకోవటానికి సిద్దపడ్డారు. భార్య వైగా రెడ్డితో కలిసి ఈ రోజు ఆయన గోవాకి వెళ్లారు. అక్కడే ఇక సెలెబ్రేషన్స్ ఊపందుకోనున్నాయి.
ఇక నిన్న ఇచ్చిన పార్టీలో చిరంజీవి, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ తేజ్, విజయ్ దేవరకొండ, వరుణ్‌తేజ్, సమంత-చైతన్య, రామ్, నితిన్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రాశీఖన్నా, పూజాహెగ్డే, నివేదా పేతురాజు, అనుపమ పరమేశ్వరన్, విశ్వక్‌సేన్ లాంటి తెలుగు హీరో, హీరోయిన్స్‌తోపాటు కన్నడ నటుడు యశ్ సైతం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. దిల్‌రాజు పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
“ఇప్పటివరకు జీవితం వేరు. ఇకపై వేరు. సినిమాల నిర్మాణం… ఆ వ్యవహారం ఎలాగూ ఉంటుంది. ఇకపై ఛారిటీపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. జెన్యూనుగా అవసరం ఉన్నవాళ్లకు. మంచి ర్యాంక్ వచ్చి, సీట్ వచ్చినా ఆర్థిక స్తొమత లేక ఇబ్బంది పడేవారికి హెల్ప్ చేస్తాను. విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో ఛారిటీ చేస్తా,” అని దిల్ రాజు చెప్పారు.