Latest Videos

‘హరోం హర’ఎంతకు అమ్మారు, బ్రేక్ ఈవెన్ అవుతుందా?

By Surya PrakashFirst Published Jun 15, 2024, 12:22 PM IST
Highlights

బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.6.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే తప్ప.. టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమనే స్దితిలో రిలీజ్  అయిన ఈ చిత్రానికి 


సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హరోం హర’కు రిలీజ్ ముందు మంచి అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మొదలైన ఈ సినిమా.. ఇప్పుడు రీజనల్ మూవీగానే రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్.. బాగుండటం చాలా వరకూ ప్లస్ అయ్యింది. ప్లాఫ్ ల్లో ఉన్న సుధీర్ బాబు  సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించాయి.సునీల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్. ప్రమోషనల్ కంటెంట్ ప్లస్ అవటం, సుధీర్ బాబుకి మినిమమ్ థియేట్రికల్ మార్కెట్ ఉండటంతో ‘హరోం హర’ కి  బిజినెస్ బాగానే జరిగిందనే చెప్పాలి.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘హరోం హర’ చిత్రానికి రూ.5.99 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.6.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే తప్ప.. టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమనే స్దితిలో రిలీజ్  అయిన ఈ చిత్రానికి అనుకున్న స్దాయిలో రెస్పాన్స్  రాలేదు. మొదటి రోజు నెట్ కలెక్షన్స్ కేవలం 80 లక్షలు మాత్రమే వచ్చాయి. ఓవర్ హైపే సినిమాని ముంచేసిందని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు.  

హరోమ్ హర పెయిడ్ ప్రీమియర్ షోలకు  మంచి రెస్పాన్స్ లభించింది. దాంతో నైజాంలో చాలా చోట్ల  హౌజ్‌ఫుల్స్ మార్నింగ్ షోకు నమోదు అయ్యాయి. బుక్ మై షోలో 93 శాతం రెస్పాన్స్ వచ్చింది. ఇక పేటీఎంలో 91 శాతం ఓటింగ్ పాజిటివ్‌గా జరిగింది. ఈ సినిమాను సుమారుగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మార్నింగ్ షోకు  మిక్స్ డ్ టాక్ రావడంతో   ఆక్యుపెన్సీ పెరగలేదు.  సాయంత్రానికి పికప్ అవుతుందనుకుంటే ఓ మోస్తారు కలెక్షన్లు నమోదు అయ్యాయి.  ఇలాంటి కలెక్షన్స్ తో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వటం కష్టమే. 

click me!