ఎన్టీఆర్ 'దేవర' పార్ట్ 2 కథ ఇలాగే ఉండబోతోందా?

By Surya Prakash  |  First Published Sep 28, 2024, 10:28 AM IST

 కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్‌కు ఇండస్ట్రీ హిట్‌ పడినట్లే అని ట్రేడ్ అంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ గురించి చర్చ మొదలైంది. 



ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన  'దేవర'  థియేటర్లలోకి వచ్చేసాడు. ఎన్టీఆర్‌ అభిమానుల పండగ చేసుకున్నారు.  ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్‌, ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత డెరెక్టర్‌ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. మార్నింగ్ ఎర్లీ షోల నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  అయితే ‘దేవర’పై క్రియేట్‌ అయిన భారీ హైప్ కు తగ్గట్లు సినిమా లేదంటున్నారు. ఏదైమైనా  భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఓ వర్గానికి బాగా నచ్చింది. ఫస్టాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కోసమైనా మళ్లీ మళ్లీ చూడవచ్చు అంటున్నారు. కొరటాల శివకు భారీ బ్రేక్‌ వచ్చినట్లే అని చెప్తున్నారు. ఈ సినిమా  కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్‌కు ఇండస్ట్రీ హిట్‌ పడినట్లే అని ట్రేడ్ అంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెకండ్ పార్ట్ గురించి చర్చ మొదలైంది. 


 
దేవర కథ

 ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు  ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరుగుతుంది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్) ఊరి పెద్ద. తన వాళ్లతో కలిసి దేవర మొదట్లో సముద్రం ద్వారా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం చేస్తూంటారు. అయితే దాని వల్ల ప్రజలకు జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర నిర్ణయించుకుని కఠినంగా అమలు జరుపుతాడు. అది దేవర మిగతా మనుష్యులకు గిట్టదు. ముఖ్యంగా  భైరవ( సైఫ్ అలీ ఖాన్),  కుంజర(షైన్‌ టామ్‌ చాకో) అతన్ని ఎదిరిస్తారు. నీ లెక్కేంటి మేము మళ్లీ సముద్రంపైకి వెళ్తామంటారు.

Latest Videos

అప్పుడు దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపించి, సముద్రం దొంగతనాలకు దూరం చేస్తారు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు.  ఈ క్రమంలో  అతని కొడుకు వర(ఎన్టీఆర్)   భయస్తుడిగా పరిచయం అవుతాడు.  వీటితో పాటు గ్యాంగ్‌స్టర్‌ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే ఫస్ట్ పార్ట్ లో చెప్పిన ప్రధాన కథ. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఏయే  విషయాలను కొరటాల టచ్ చేస్తారు. కథలో ఏ మలుపులుకు వివరణ ఇస్తూ నడుపుతాడు. 

దేవర  సెకండ్  పార్ట్ లో ఏ విషయాలు డిస్కస్ చేస్తారు.

 'దేవర'  సెకండ్  పార్ట్ లో చూసిన ..ప్రధానంగా తేల్చి చెప్పాల్సింది. అసలు సినిమా మొదట్లో వచ్చే గ్యాంగస్టర్ యతి, దయ ఎవరు అనేది. అలాగే మురగ పాత్ర ఎలా చచ్చిపోయింది. ఎవరు చంపేసారు. ఇక మొదట్లో మురుగన్‌తో పాటు తిరుగుతూ దొంగ పనులు కు సపోర్ట్ చేసే డీఎస్పీ తులసికి ముఖం, ఒంటిపై దెబ్బలు ఎలా తగిలాయి? ఎవరు కొట్టారు.  వీటిన్నటితో పాటు సినిమా ప్రారంభంలో  సీబీఐకు చెందిన  అజయ్ కు నీటిలో కనపడ్డ   అస్థి పంజరాలు  అసలుఎవరివి?

 అలాగే  'దేవర'ని చంపింది ఎవరు?

నిజంగానే చచ్చిపోతాడా...అలాగే వర పాత్ర కూడా చనిపోయినట్లు చూపించారు. అది చచ్చిపోతుందా? దేవర పాత్ర సెకండాఫ్ లో మళ్లీ వస్తుందంటున్నారు. అతను చనిపోలేదు అని చెప్తున్నారు. వీటితో పాటు వర ని జాన్వీ పెళ్లి చేసుకుంటుందా వంటి విషయాలు సెకండ్ పార్ట్ లో కొరటాల క్లారిటీ ఇస్తారు. ఇవ్వాల్సిన అవసరం ఉంది. 

ఎన్టీఆర్ వేరియేషన్ హైలెట్ 

 ఇక దేవర, వర(వరద) అనే  రెండు విభిన్న పాత్రలో కనిపించిన ఎన్టీఆర్‌.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ తో మాస్‌ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని  మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇక డ్యాన్స్‌ కూడా ఇరగదీశాడు. ఈ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌  భైరవ అనే ఓ డిఫరెంట్‌ పాత్రను పోషించాడు. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
  

click me!