OTT లో ‘35: చిన్న కథ కాదు’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు,ఎక్కడ?

By Surya Prakash  |  First Published Sep 28, 2024, 9:10 AM IST

  రీసెంట్ గా  విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న మూవీ 35: చిన్న కథ కాదు. సెప్టెంబరు మొదటి వారంలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.  


ఈ మద్యన చిన్న చిత్రాలను థియేటర్ కు వెళ్లి చూడటం తగ్గింది. ఓటిటి రిలీజ్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు. ఆ క్రమంలో రీసెంట్ గా  విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న మూవీ 35: చిన్న కథ కాదు. సెప్టెంబరు మొదటి వారంలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.  మన విద్యా వ్యవస్థ గురించి, టీచర్ల గురించి, వాళ్లు చెప్పే పాఠాలు, అలాగే పిల్లల స్నేహాలు గురించి, క్లాస్ రూమ్ లో పిల్లలు  మార్కుల కోసం పడే తపన, పిల్లలకు టీచర్స్‌తో ఉండే అనుబంధం గురించి  ఈ సినిమా మాట్లాడుతుంది. కాబట్టి ఫ్యామిలీలు తమ పిల్లలతో కూర్చుని చూసే అవుతుంది.

 నివేదా థామస్‌ ప్రధాన పాత్రలో 

 నివేదా థామస్‌ (Nivetha Thomas), విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించారు. రానా నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్‌ 6న విడుదలైంది. ఇందులో నివేదా తల్లి పాత్ర పోషించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. 

ఓటిటి ఆహా విషయానికి వస్తే..

Latest Videos

తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో అక్టోబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది...😍 అని ఆహా పోస్టర్‌ను పంచుకుంది.  ఇది తెలుగులో  తారే జమీన్ పర్  స్దాయి సినిమా అనుకోవాలి. ఓటిటిలో చూడదగ్గ సినిమానే.


 
35 చిన్న కథకాదు  కథేంటి

లెక్కల్లో అందరికీ అనుమానాలు ఉంటాయి.. కానీ మా వాడికి లెక్కల మీదే అనుమానం సర్ అనే  డైలాగ్‌ చుట్టూ తిరిగే కథ. బస్ కండక్టర్  ప్ర‌సాద్ (విశ్వ‌దేవ్ రాచ‌కొండ) ది మిడిల్ క్లాస్ జీవితం. భార్య స‌ర‌స్వ‌తి (నివేదా థామ‌స్),  త‌న భ‌ర్త‌, పిల్ల‌లు అరుణ్‌, వ‌రుణ్ సర్వస్వం. తిరుప‌తిలో ఉండే వీళ్లకు జీవిత సమస్యలు పెద్గగా ఉండవు కానీ పిల్లల వైపు సమస్యలు ఉంటాయి. అయితే అవి సమస్యలు అని వాళ్లకు తెలియదు.  అవేమిటంటే వాళ్ల పెద్దబ్బాయి అరుణ్‌కి మ్యాథ్స్ లో వీక్. వాడికి లెక్క‌లు ఓ ప‌ట్టాన అర్థం కావు. అలాగని తెలివి తక్కువ వాడేమీ కాదు.

లాజిక్ గా వాడి అడిగే ప్రశ్నల మాస్టర్స్ ని ఇబ్బందుల్లో పడేస్తూంటాయి. సున్నాకి ఏమీ విలువ లేన‌ప్పుడు దానిప‌క్క‌న ఒక‌టి వ‌చ్చి నిల‌బ‌డితే ప‌ది ఎందుకవుతుంద‌ని అడిగితే, అదెలాగో వివరించి చెప్పలేరు.  దాంతో లెక్క‌ల మాస్టారు చాణ‌క్య (ప్రియ‌ద‌ర్శి) ఫండమెంటల్స్‌ను ప్ర‌శ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి చివ‌రి బెంచీకి పంపేస్తాడు. ఆరోత‌ర‌గ‌తిలో ఫెయిల్ కూడా చేస్తాడు. 

ఈ క్రమంలో అరుణ్  త‌న త‌మ్ముడి క్లాస్‌లో కూర్చోవాల్సి వ‌స్తుంది. ఈసారి అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్క‌ల్లో క‌నీసం 35 మార్కులు సాధించాల్సిందే. అప్పుడు వాళ్ల అమ్మ సరస్వతి ఎలా లీడ్ తీసుకుంది. పదో తరగతి ఫెయిల్ అయ్యిన ఆమె తన కొడుకుని ఎలా గట్టెక్కించింది. అరుణ్ అస‌లు 35 మార్కులు తెచ్చుకున్నాడా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.
 

click me!