సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరడుగుల అందగాడు. 49 ఏళ్ళ వయసులో కూడా మహేష్ తన చార్మ్ కోల్పోకుండా కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీలో ఈ తరహాలో అందం మైంటైన్ చేయడం ఇతర హీరోలకు సాధ్యం కాదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరడుగుల అందగాడు. 49 ఏళ్ళ వయసులో కూడా మహేష్ తన చార్మ్ కోల్పోకుండా కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీలో ఈ తరహాలో అందం మైంటైన్ చేయడం ఇతర హీరోలకు సాధ్యం కాదు.మహేష్ బాబుకి మాస్ ఆడియన్స్ ఎంతలా అభిమానులుగా ఉన్నారో అదే స్థాయిలో మహిళా అభిమానులు కూడా ఉన్నారు.
మహేష్ బాబు వాయిస్ కూడా అద్భుతంగా ఉంటుంది. మహేష్ డైలాగ్ చెప్పినా, నవ్వినా అంతే అందంగా ఉంటుంది. మాస్ డైలాగ్స్ ని మహేష్ బాబు ఇంటెన్సిటీతో చెబుతారు. మహేష్ బాబు అందం మాత్రమే కాదు, వాయిస్ లో కూడా మ్యాజిక్ ఉందని చాలా మంది చెబుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మహేష్ బాబు గొంతు విషయంలో ఒక స్టార్ హీరోయిన్ మోసపోయిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు కియారా అద్వానీ.
కియారా అద్వానీ, మహేష్ బాబు కలసి భరత్ అనే నేను చిత్రంలో నటించారు. ఓ ఇంటర్వ్యూలో కియారా అద్వానీని మహేష్ బాబు గురించి ప్రశ్న ఎదురైంది. గతంలో ఎప్పుడైనా మహేష్ బాబు సినిమాలు చూశారా అని యాంకర్ అడిగింది. కియారా అద్వానీ బదులిస్తూ చూశాను. కానీ డబ్బింగ్ సినిమాలు చూశాను. అందులో దూకుడు చిత్రం కూడా ఉంది.
మహేష్ బాబు ఇంత అందంగా ఉన్నారు. కానీ ఆయన వాయిస్ ఏంటి ఇంత దారుణంగా ఉంది. ఆయన బాడీకి.. డబ్బింగ్ మూవీస్ లో వచ్చిన వాయిస్ కి ఏమాత్రం సంబంధం లేదు. మహేష్ బాబు గొంతు ఇంత దారుణంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయా అని కియారా తెలిపింది. కానీ రియల్ గా మీట్ అయ్యాక అప్పుడు ఆయన వాయిస్ అందానికి తగ్గట్లుగా చాలా బావుంది అనిపించింది అని పేర్కొంది.
మహేష్ బాబు మాట్లాడుతూ కియారా నా డబ్బింగ్ సినిమాల గురించి చెబుతుంటే నాకే సిగ్గుగా అనిపించింది. డబ్బింగ్ సినిమాల్లో వాయిస్ చిత్ర విచిత్రంగా ఉంటుంది అని మహేష్ తెలిపారు. అదే విధంగా భరత్ అనే నేను షూటింగ్ లో కూడా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందట. కియారా తెలుగులో డైలాగులు చెప్పడం అదే ఫస్ట్ టైం.. మొదట ఒక డైలాగ్ ఇచ్చారట. మహేష్ బాబుతో కియారా చెప్పే డైలాగ్ అది.
రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసి చెప్పేయ్ అని మహేష్ అన్నారట. నీదేం పోయింది.. ఇది నాకు చైనీస్ భాషలా అనిపిస్తోంది అంటూ షూటింగ్ తర్వాత మహేష్ తో కియారా ఫన్నీగా చెప్పిందట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో మహేష్ బాబు సీఎం పాత్రలో నటించారు. మహేష్ బాబు సీఎం గా నటిస్తే ఆ హుందా తనం, స్టైల్ కనిపించింది అని ప్రశంసలు దక్కాయి. కియారా అద్వానీకి తెలుగులో ఇదే డెబ్యూ చిత్రం.
ఆ తర్వాత రాంచరణ్ సరసన బోయపాటి దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి కియారా రాంచరణ్ కి జోడిగా గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. కియారా అద్వానీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె తన ప్రియుడు బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణిస్తోంది. ఎంఎస్ ధోని, కబీర్ సింగ్, భరత్ అనే నేను లాంటి చిత్రాలు కియారా అద్వానీకి గుర్తింపు తీసుకువచ్చాయి.
గేమ్ ఛేంజర్ చిత్రం సక్సెస్ ని బట్టి ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ ఉండే అవకాశం ఉంది. డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ చిత్రాన్ని పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం నుంచి జరగండి అనే సాంగ్ వచ్చింది. అయితే ఈ సాంగ్ కాస్త ట్రోలింగ్ కి గురైంది. వినయ విధేయ రామ చిత్రంలో రాంచరణ్, కియారా కెమిస్ట్రీ కి మంచి మార్కులు పడ్డాయి కానీ ఆ చిత్రం నిరాశ పరిచింది. ఈసారైనా ఈ జంట హిట్ కొడతారో లేదో చూడాలి.