సుహాసిని ఓడిపోతే.. ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తారా..?

By Udayavani DhuliFirst Published Dec 11, 2018, 8:05 AM IST
Highlights

మరికొద్ది గంటల్లో తేలిపోనున్న తెలంగాణా అసెంబ్లీ ఎలెక్షన్ రిజల్ట్స్ కోసం ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా మంది కళ్ళు కూకట్ పల్లి అసెంబ్లీ సీట్ మీదే ఉన్నాయి. 

మరికొద్ది గంటల్లో తేలిపోనున్న తెలంగాణా అసెంబ్లీ ఎలెక్షన్ రిజల్ట్స్ కోసం ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా మంది కళ్ళు కూకట్ పల్లి అసెంబ్లీ సీట్ మీదే ఉన్నాయి.

టీడీపీ పార్టీ తరఫునదివంగత నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినిని కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయగా ఆమెకి పోటీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి మాధవరం కృష్ణరావు బరిలో నిల్చున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. అయితే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ను బట్టి నందమూరి సుహాసిని గెలవడం కష్టమనే సంకేతాలు వస్తున్నాయి.

మాధవరంకి లోకల్ గా ఉన్న బేస్ అలానే రూలింగ్ పార్టీ తరఫున పోటీ చేస్తుండడంతో ఆయనకి ఓట్లు కూడా ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు నందమూరి క్యాంప్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నందమూరి అభిమానులు సుహాసిని  గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు. సుహాసిని గెలిస్తే గనుక ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబునాయుడు తీసేసుకుంటాడు.

కానీ ఓడిపోతే పరిస్థితి ఏంటి..? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆమె ఓడిపోతే గనుక జూనియర్ ఎన్టీఆర్ ని వేలెత్తి చూపిస్తారని అంటున్నారు. తన అక్క తరఫున తారక్ ప్రచారం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోననే మాటలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. టీడీపీ సపోర్టర్స్, చంద్రబాబు ఫ్యాన్స్ కంటే సుహాసిని గెలవాలని ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా ప్రార్ధిస్తున్నారు. 

click me!