సందీప్ కిషన్ కు విలన్ గా మారిన కమెడియన్!

Published : Dec 11, 2018, 07:29 AM IST
సందీప్ కిషన్ కు విలన్ గా మారిన కమెడియన్!

సారాంశం

కమెడియన్స్ కొంతదూరం వెళ్లి హిట్ బాటలో నడుస్తూండగా సరదగా హీరోగా ఎందుకు ట్రై చేయకూడదు అనిపిస్తుంది. అనిపించటమే తడువు మొదలెట్టేస్తూంటారు. అలా స్టార్ కమెడియన్స్ ఎదిగిన వారంతా ఏదో ఒక టైమ్ లో హీరోలుగా కనిపించిన వారే. 

కమెడియన్స్ కొంతదూరం వెళ్లి హిట్ బాటలో నడుస్తూండగా సరదగా హీరోగా ఎందుకు ట్రై చేయకూడదు అనిపిస్తుంది. అనిపించటమే తడువు మొదలెట్టేస్తూంటారు. అలా స్టార్ కమెడియన్స్ ఎదిగిన వారంతా ఏదో ఒక టైమ్ లో హీరోలుగా కనిపించిన వారే. అయితే విలన్ గా కనిపించిన కమిడియన్స్ మాత్రం మనకు అతి తక్కువ మంది కనిపిస్తారు. ఎందుకంటే కామెడీ చేసేవాడు విలనీ లుక్ రాదని దూరం పెట్టేస్తూంటారు. కానీ రాహుల్ రామకృష్ణకు మాత్రం అలాంటి అవకాసం కెరీర్ ప్రారంభంలోనే వచ్చింది.

‘అర్జున్‌రెడ్డి’సినిమాలో విజయ్ దేవరకొండకు స్నేహితుడుగా కనిపించిన శివ గుర్తుండే ఉండి ఉంటాడు. ఆ పాత్రలో చేసిన రాహుల్ రామకృష్ణ పూర్తి స్దాయిలో బిజి అయ్యిపోయారు. వరస పెట్టి ప్రాజెక్టులు చేస్తున్న రామకృష్ణ అతి త్వరలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న  నిను వీడని నీడను నేనే  సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. ఆ విషయాన్ని స్వయంగా రాహుల్ రామకృష్ణే మీడియాకు తెలియచేసారు.  

సందీప్ కిషన్   నిర్మాతగా మారి...తన కెరీర్‌లో మెమరబుల్ మూవీగా నిలిచిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ పేరుతో, వెంకటాద్రి టాకీస్ బ్యానర్ స్టార్ట్ చేసి, దయ పన్నెం, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్‌‌తో కలిసి, నిను వీడని నీడను నేనే మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కార్తిక్ రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్య సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన  ఈ సినిమా ఫస్ట్‌లుక్ కు మంచి క్రేజ్ వచ్చింది. 

రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ... సందీప్‌ కిషన్‌తో ‘నిను వీడని నేనే’ సినిమా చేశా. ఇది తమిళ్‌లో ‘కన్నాడి’గా విడుదల కాబోతోంది. ఇందులో నాది విలన్‌ వేషం. భవిష్యత్తులోనూ విలన్‌ వేషాలు వేయాలనుంది’ అన్నారు.

‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు రాహుల్‌ రామకృష్ణ. ఆ తర్వాత ‘అర్జున్‌రెడ్డి’, ‘భరత్‌ అనే నేను’, ‘సమ్మోహనం’, ‘చి.ల.సౌ’, ‘గీత గోవిందం’ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన కీలక పాత్రలో నటించిన హుషారు చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది.

 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌