KIFF 2023: బెంగాల్ సీఎం తో డాన్స్ చేయించిన సల్మాన్ ఖాన్, స్టార్స్ తో కలిసి మమతా బెనర్జీ మాస్ స్టెప్పులు..

Published : Dec 06, 2023, 10:47 AM IST
KIFF 2023: బెంగాల్ సీఎం తో డాన్స్ చేయించిన సల్మాన్ ఖాన్, స్టార్స్ తో కలిసి మమతా బెనర్జీ మాస్ స్టెప్పులు..

సారాంశం

కోల్ కతాలో ఫిల్మ్ ఫెస్టివల్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఓ అరుదైన ఆశ్చర్యకరసంఘటన జరిగింది. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బెంగాల్ సీఏం మమతా బెనర్జీ డాన్స్ చేశారు..   


ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా నగరంలో.. సిటీ ఆఫ్ జాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఫెస్టివల్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్చారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి  టైగర్ 3 హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ కూడా అతిథిగా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్‌తో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వంటి పలువురు ప్రముఖులు కూడా KIFF 2023 లోసందడి చేశారు. 

ఈక్రమంలో ఈ వేడుకల్లో అరుదైన దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచింది. చాలా హుందాగా.. సీరియస్ గా ఉండే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాసేపు సరదాగా అభిమానులనుఅలరించారు. ఏకంగా డాన్స్ స్టెప్పులేసి షాక్ ఇచ్చారు. మమత చేత డాన్స్ చేయించరు సల్మాన్ ఖాన్. వీరితో పాటు బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మహేష్ భట్, టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, అనిల్ కపూర్ ఇతర తారలు కూడా కాలు కదిపారు. 

 

అయితే ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సినీ ప్రముఖులతో కలిసి డాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మమతా బెనర్జీ సల్మాన్ ఖాన్ సహా ఇతరులతో ఒకే వేదికపై చేరడం సినీ అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. సింగర్ అరిజిత్ సింగ్ పాడిన పాటకు మమతా బెనర్జీ కాలుకదిపి ఫిలిం ఫెస్టివల్‌లో జోష్ నింపారు.

29వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా, సౌరవ్ గంగూలీకి సంబంధించిన తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సల్మాన్ గురించి సౌరవ్ మాట్లాడుతూ- అందరికీ ఇష్టమైన, నాకు ఇష్టమైన సల్మాన్ ఖాన్‌ను మొట్ట మొదటిసారిగా కలుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మేము ఇంతకు ముందెన్నడూ కలవకపోవడం దురదృష్టకరమని చెప్పారు.

 

ఇక అత్యంత ఘనంగా  జరుగుతున్న కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో సల్మాన్ ఖాన్‌తో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు.  హిందీ సినిమాకి చెందిన నటులు కనిపించారు. అనిల్ కపూర్, సోనాక్షి సిన్హా, మహేష్ భట్, శతృఘ్న సిన్హా తో పాటు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే