కాంగ్రెస్ గెలిచింది సంతోషంగా ఉంది... అల్లు అరవింద్ కీలక కామెంట్స్ 

By Sambi ReddyFirst Published Dec 4, 2023, 4:09 PM IST
Highlights


తెలుగు సినిమా హబ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఈ పరిణామాలను సీరియస్ గా గమనిస్తుంది చిత్ర పరిశ్రమ. పరిశ్రమ పెద్దల్లో ఒకరైన అల్లు అరవింద్ స్పందించారు. 
 


అన్ని రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. వాటిలో చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే సీఎంని కలిసే సంప్రదాయం చాలా కాలంగా ఉంది. ఏపీ విభజన తర్వాత రెండు రాష్ట్రాలు, ఇద్దరు సీఎంలు వచ్చారు. గత పదేళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ కి ప్రజలు అధికారం కట్టబెట్టారు. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో నెలకొని ఉంది. కాబట్టి అక్కడి ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 

బీఆర్ఎస్ ప్రభుత్వంకి తెలుగు చిత్ర పరిశ్రమ అనుకూలంగా ఉంటూ వస్తుంది. కేటీఆర్ అనేక సినిమా ఫంక్షన్స్ లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఆ వేదికలపై కేటీఆర్ సమర్ధతను, బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును అనేక మంది చిత్ర ప్రముఖులు ప్రశంసించారు. ఇప్పుడు సినారియో మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 64 సీట్లతో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ విజయంపై నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 

Latest Videos

ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆనందంగా ఉంది. వారికి మా శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు కల్పించింది. అలాగే గత ప్రభుత్వాలు కూడా టాలీవుడ్ కి అండగా ఉన్నాయి. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరిస్తుందని, ప్రోత్సాహాం కల్పిస్తుందని భావిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. త్వరలో కాంగ్రెస్ పెద్దలను కలుస్తాం.. అన్నారు. 

కాగా 2019లో ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే సీఎంని కలవాలన్న సాంప్రదాయం టాలీవుడ్ పాటించలేదు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంతో తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం పెరిగింది. టికెట్స్ ధరలు తగ్గించడంతో వివాదం రాజుకుంది. నాని వంటి హీరోలు కిరాణా కొట్టు కలెక్షన్ కంటే సినిమా థియేటర్ కలెక్షన్ తక్కువగా ఉంటుందని అసహనం వ్యక్తం చేశాడు. 

వాళ్లతో లిప్ లాక్ అసలు నచ్చలేదన్న స్టార్స్!

click me!