Nani: దర్గా మొక్కులు చెల్లించిన నేచురల్ స్టార్, కడపలో నాని ప్రత్యేక ప్రార్థనలు

Published : Dec 04, 2023, 01:59 PM IST
Nani: దర్గా మొక్కులు చెల్లించిన నేచురల్ స్టార్, కడపలో నాని ప్రత్యేక ప్రార్థనలు

సారాంశం

హాయ్ నాన్న ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని. వరుసగా పర్యటనలు, స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ బీజీ అయిపోయాడు. తాజాగా హాయ్ నాన్న కోసం ప్రత్యేకంగా ప్రార్ధనలు కూడా చేశాడు నాని.   

టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని  హీరోగా న‌టిస్తున్న తాజా మూవీ.. హాయ్‌ నాన్న . నాని 30  వ సినిమాగా  తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అయితే ఈ సినిమా డిసెంబరు 7న ప్రపంచవ్యాప్తంగా  ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాగా ఈమూవీ రిలీజ్ అయ్యింది. 

Ram Charan : ఆధ్యాత్మిక సేవలో మెగా పవర్ స్టార్, చాముండేశ్వరి సన్నిధిలో రామ్ చరణ్

అయితే సినిమా రిలీజ్ దగ్గరలో ఉండటంతో..  ప్ర‌మోష‌న్స్‌లో జోరు పెంచారు టీమ్. రీసెంట్ గానే ఈమూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా  కడప వెళ్లారు నాని.  అక్క‌డ‌ ప్రమోషన్లు పూర్తయిన తరువాత  ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నాని పెద్ద దర్గాకు రావడంతో చుట్టుపక్కల కోలాహలం నెలకొంది. 

నేచురల్ స్టార్ నానిని చూసేందుకు అభిమానులు ఏగబడ్డారు. ఇక నాని మాట్లాడుతూ.. త‌న‌కు కడప ద‌ర్గాలో మొక్కు ఉంద‌ని.. అది తీర్చుకోవాలని ఇక్క‌డ‌కు వచ్చానని.. దర్గాను సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు. అంత‌కుముందు కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ స‌మయంలో కూడా నాని కడప ద‌ర్గాను ద‌ర్శించుకున్నారు. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ భామ సీతారామం ఫేం మృణాళ్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తోండ‌గా.. మలయాళ నటుడు జయరాం కీలక పాత్ర పోషిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌