Yash 19 : రాఖీబాయ్ సాలిడ్ అప్డేట్.. ‘యష్19’ టైటిల్ ఫిక్స్.. ఆ విషయంలో ఇంకా సస్పెన్స్

Published : Dec 04, 2023, 03:49 PM IST
Yash 19 :  రాఖీబాయ్ సాలిడ్ అప్డేట్.. ‘యష్19’ టైటిల్ ఫిక్స్.. ఆ విషయంలో ఇంకా సస్పెన్స్

సారాంశం

‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ తర్వాత యష్ తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఈరోజు తన 19వ చిత్రంపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. టైటిల్ ప్రకటించబోతున్నట్టు డేట్ ఫిక్స్ చేసి తానే స్వయంగా వెల్లడించారు. 

కన్నడ స్టార్ హీరో యష్ (Yash)  గురించి ఇప్పుడు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘కేజీఎఫ్’ ఛాప్టర్ 1 మరియు 2తో ఇండియా మొత్తం రాఖీ బాయ్ గా క్రేజ్ దక్కించుకున్నారు. ఆ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. దీంతో యష్ తదుపరి చిత్రాలపై చాలా ఆసక్తి నెలకొంది. యష్19 (Yash19) మూవీపై ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని అంతా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఏడాదిన్న సమయం తీసుకున్నారు యష్. ఇటీవల మూవీ అప్డేట్ ఇస్తానని అభిమానులకు మాటిచ్చారు. 

అన్నట్టుగానే ఈరోజు తన 19వ చిత్రంపై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. Yash 19  టైటిల్ ను ప్రకటించబోతున్నట్టు తానే స్వయంగా ఇన్ స్టా వేదికన వెల్లడించారు. డేట్ కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 8న ఉదయం 9:55 నిమిషాలకు టైటిల్ ను అనౌన్స్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఈక్రేజీ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. అయితే సడెన్ గా టైటిల్ గురించి అప్డేట్ ఇచ్చినా యష్.. ఇంతకీ డైరెక్టర్ ఎవరు? మిగితా కాస్ట్, టెక్నీషియన్ల గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. 

ఆ మధ్యన యష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas)  అప్పగించారని ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఇవ్వాళ్టి టైటిల్ అనౌన్స్ మెంట్ లో మాత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్ లో తన సినిమా రూపుదిద్దుకుంటోందని చెప్పుకొచ్చారు. కానీ ఇతర విషయాలను సస్పెన్స్ గానే ఉన్నారు. టైటిల్ తో పాటు  డైరెక్టర్, ఇతర టెక్నీషియన్లను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘కేజీఎఫ్2’ హయ్యేస్ట్ కలెక్షన్లను రాబట్టింది. ఇండియాలోనే మూడో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలించింది. దీంతో నెక్ట్స్ సినిమా ఆ స్థాయిలో ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మణిరత్నం సంచలనం.. 34 ఏళ్ల బంధానికి బ్రేక్.. రెహమాన్‌ను కాదని కుర్రాడికి ఛాన్స్
Ustaad Bhagat Singh Movie Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ రివ్యూ, పవన్‌ కళ్యాణ్‌ విశ్వరూపం చూపించాడా?