సింపుల్ గా కానిచ్చేద్దాం అంటూ అసలు రిసెప్షన్ కూడా వద్దన్నారట

Published : Oct 05, 2017, 10:19 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
సింపుల్ గా కానిచ్చేద్దాం అంటూ అసలు రిసెప్షన్ కూడా వద్దన్నారట

సారాంశం

నాగచైతన్య, సమంత లపెళ్లి కార్డు శుక్ర వారం రాత్రి 11.52గంటలకు పెళ్లి ముహూర్తం పెళ్లి కార్డు మాత్రం అఖిల్  పెళ్లి కోసం చేసిన కార్డులా లేదు కొత్త జంట రిసెప్షనూ వద్దన్నారట

టాలీవుడ్ హాట్ లవర్స్, న్యూ కపుల్ కాబోతున్న అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లికి సర్వం సిద్ధమైంది. గోవాలో జరగనున్న ఈ పెళ్లి వేడుకకు అత్యంత సన్నిహితులు, సమీప బంధువులు మాత్రమే హాజరవుతున్నారు. శుక్రవారం రాత్రి 11:52 గంటల శుభ ముహూర్తానికి చైతూ హిందూ సంప్రదాయం ప్రకారం సమంత మెడలో తాళి కట్టనున్నాడు. రేపు సాయంత్రం మెహెందీ ఫంక్షన్‌ని సెలబ్రేట్ చేసుకున్న అనంతరం ఈ పెళ్లి తంతు జరగనుంది.



ఆ తర్వాతి రోజు.. అంటే అక్టోబర్ 7న సాయంత్రం పొద్దుపోయాకా క్రిష్టియన్ సంప్రదాయం ప్రకారం ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోనుంది. చైతూ హిందువు కావడంతో మొదటిరోజు హిందూ సంప్రదాయం ప్రకారం, సమంత క్రిష్టియన్ కావడంతో రెండో రోజు క్రిష్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకని ప్లాన్ చేశారు. ఈ రెండు వేడుకలు పూర్తయ్యాకా జరిగే రిసెప్షన్ వేడుకను అంగరంగ వైభవంగా వివిధ రంగాల ప్రముఖల మధ్య సెలబ్రేట్ చేసుకునేందుకు అక్కినేని కుటుంబం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే నాగార్జున ఈ వేడుక ఘనంగా జరగాలని పట్టుబడుతుంటే.. చైతూ..సామ్ లు మాత్రం సింపుల్ గా జరిపించాలని, అసలు రిసెప్షన్ కూడా అక్కర్లేదని అంటున్నారట. అదో ఖర్చు అనుకున్నారో లేక మరేంటో.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?