తారక్ మాటలను ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారా..?

Published : Feb 27, 2019, 04:57 PM IST
తారక్ మాటలను ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారా..?

సారాంశం

నందమూరి అభిమానులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ పెద్ద హిట్ అవుతుందనుకుంటే దానికి కనీసపు కలెక్షన్స్ కూడా రాక కొట్టుమిట్టాడుతోంది. 

నందమూరి అభిమానులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ పెద్ద హిట్ అవుతుందనుకుంటే దానికి కనీసపు కలెక్షన్స్ కూడా రాక కొట్టుమిట్టాడుతోంది. నందమూరి ఫ్యాన్స్ చూసిన చాలని, ఈ సినిమా హిట్ అయిపోతుందని అనుకున్నారు చిత్రబృందం కానీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను పట్టించుకోలేదు.

అయితే ఇప్పుడు మరో నందమూరి హీరోని కూడా అభిమానులు లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా '118' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి.

సినిమాపై హైప్ పెంచడానికి ప్రీరిలీజ్ ఈవెంట్ కి బాలయ్య, ఎన్టీఆర్ లను తీసుకొచ్చాడు కళ్యాణ్ రామ్. ఈ ఈవెంట్ లో తారక్ తన అన్నయ్య గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇది బెస్ట్ ఫిలిం అవుతుందని చెప్పాడు. సినిమా చాలా బాగా వచ్చిందని స్టేజ్ మీద తారక్ చెప్పాడు.

కానీ ఈ విషయాలను ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నట్లు లేరు. సినిమా రిలీజ్ ఉందన్న హడావిడి కూడా ఎక్కడా కనిపించడం లేదు. శుక్రవారం నాడు సినిమా రిలీజ్ తరువాత వచ్చే టాక్ ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. మౌత్ టాక్ బాగుంటే గనుక ప్రేక్షకులు థియేటర్లకి పరుగులు తీయడం ఖాయం!  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!