అందులో గొప్పేముంది.. మోడీపై హీరోయిన్ కామెంట్!

Published : Feb 27, 2019, 03:40 PM IST
అందులో గొప్పేముంది.. మోడీపై హీరోయిన్ కామెంట్!

సారాంశం

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం.. పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు జరిపింది.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం.. పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు జరిపింది. అయితే ఆ రాత్రంతా ప్రధాని నరేంద్ర మోడీ నిద్రపోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అయితే దీనిపై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. '' మోడీ రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారా.. అందులో గొప్పేముంది. అది ఆయన ఉద్యోగంలో భాగం'' అంటూ ట్వీట్ చేసింది.

ఇటువంటి సమయంలో స్వరాభాస్కర్ ఈ రకమైన కామెంట్ చేయడంతో నెటిజన్లు ఆమెను తప్పుబడుతున్నారు. ఆమెను దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 'మీరు 18 గంటలు పని చేస్తారా..? లేదు కదా ఎందుకంటే మీకు అసలు పనే దొరకడం లేదు కాబట్టి. మీరు అర్బన్ నక్సలైట్ లా తయారయ్యారు' అంటూ విమర్శించారు.

ఆమె పెట్టిన ట్వీట్ ని తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేసినా ఆమె మాత్రం ట్వీట్ డిలీట్ చేయలేదు. 

PREV
click me!

Recommended Stories

Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Allu Arjun: ట్రెండ్ అవుతున్న 15 ఏళ్ళ నాటి అల్లు అర్జున్ సాంగ్, ఇప్పుడెందుకు ? ఆ ఎక్స్ ప్రెషన్స్ చూశారా