Oo Antava:‘ఊ అంటావా’శ్రద్దాదాస్ వీడియో! బన్ని ఫన్ని కామెంట్

By Surya PrakashFirst Published Jan 26, 2022, 3:09 PM IST
Highlights

‘బొద్దు బొద్దుగుంటే ఒకడు ముద్దుగున్నావ్ అంటాడు.. సన్న సన్నంగుంటే ఒకడు.. సరదా పడిపోతుంటాడు.. బొద్దు కాదు సన్న కాదు.. ఒంపుసొంపు కాదండీ.. ఒంటిగ చిక్కామంటే చాలు.. మీ మగబుద్ధే వంకరబుద్ధి’ అంటూ కొంత సెటైరికల్‌‌‌‌‌‌‌‌గా లిరిక్స్ రాశారు చంద్రబోస్.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ ‌(AlluArjun) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’ (PUSHPA). సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ లో సైతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తొలిసారి స్పెషల్‌ సాంగ్‌ చేశారు. ‘ఊ అంటావా మామ ఊ ఊ అంటావా’ అంటూ ఆమె బన్నీతో కలిసి స్టెప్పులేసి ప్రేక్షకుల్ని అలరించారు. దీంతో ఈ పాటకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఈ పాటకు ఫిదా అయిపోతున్నారు.
 

🔥🔥🔥 100th stage of hallucinations

— Allu Arjun (@alluarjun)

ఈ నేపధ్యంలో హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ కూడా డాన్స్ చేసింది. పుష్ప హ్యాంగోవర్.. ఊ అంటావా పాట సూపర్.. పాటతో సరదాగా డాన్స్ అంటూ వీడియోను షేర్ చేసి అల్లు అర్జున్ ను ట్యాగ్ చేసింది. శ్రద్దా దాస్ వీడియోకు బన్నీ కూడా స్పందించాడు. 100వ దశ హ్యాలోజినేషన్(బ్రాంతీ) అంటూ  రీ ట్వీట్ చేశాడు.

 

‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అంటూ సాగే ఈ మాస్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టు కునేలా పాడింది. ‘బొద్దు బొద్దుగుంటే ఒకడు ముద్దుగున్నావ్ అంటాడు.. సన్న సన్నంగుంటే ఒకడు.. సరదా పడిపోతుంటాడు.. బొద్దు కాదు సన్న కాదు.. ఒంపుసొంపు కాదండీ.. ఒంటిగ చిక్కామంటే చాలు.. మీ మగబుద్ధే వంకరబుద్ధి’ అంటూ కొంత సెటైరికల్‌‌‌‌‌‌‌‌గా లిరిక్స్ రాశారు చంద్రబోస్.

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య డ్యాన్స్ కంపోజ్ చేశారు.   నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, సీఈవో చెర్రి మీడియా మాట్లాడుతూ..  ‘ఇలా ఒకే సినిమాలోని అన్ని పాటలూ సూపర్ హిట్ కావడం హ్యాపీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మూడు వేలకు పైగా థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో ఐదు భాషల్లో ‘పుష్ప’ని విడుదల చేసాం.  అన్ని భాషల్లోనూ చిత్తూరు బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లోనే సినిమా ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌ అనేది బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ మాత్రమే, అదే అసలు కథ కాదు. అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌ని ఎప్పుడూ చూడనంత కొత్తగా చూస్తున్నారు. అభిమానులకు ట్రీట్‌‌‌‌‌‌‌‌లా ఉంటోంది’ అని చెప్పారు.

‘పుష్ప: ది రైజ్‌’ అల్లు అర్జున్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పవచ్చు. కథ మొదలైన దగ్గరి నుంచి పుష్పరాజ్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. మాస్‌ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టేశాడు. ఏ సన్నివేశం చూసిన ‘తగ్గేదేలే’ అంటూ ఫ్యాన్స్‌తో విజిల్స్‌ వేయించాడు. చిత్తూరు యాస్‌లో బన్ని పలికిన సంభాషణలు అలరిస్తాయి. శ్రీవల్లిగా డీగ్లామర్‌ పాత్రలో రష్మిక నటన సహజంగా ఉంది.  రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది

click me!