Avika Gor :అవికాగోర్ ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’..ఇంట్రస్టింగ్ మెమెరీస్

By Surya PrakashFirst Published Jan 26, 2022, 2:50 PM IST
Highlights

ప్రతి ఒక్కరి జీవితం కథ గా మారేది ఈ క్లాస్ రూం లోనే అంటూ టీజర్ మొదలు అవుతుంది. పదవ తరగతి లో మొదలైన ప్రేమ 1999 కాలం నాటి ప్రేమ కథ మళ్ళీ 2021 లో ఏ విధంగా మారిపోయింది. పరిస్థితులు ఎలా మారాయి, రీ యూనియన్ కాన్సెప్ట్ తో అన్ని రకాల ఎమోషన్స్ ను చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.


అవికా గోర్, శ్రీరామ్‌ ప్రధాన పాత్రధారులుగా కెమెరామేన్‌ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’. అచ్యుత రామారావు, పి. రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈ రోజున  విడుదల అయ్యింది.  సురేష్‌ బొబ్బిలి ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌.

ఈ చిత్రం టీజర్ ఎమోషనల్ గా ఉంది. ప్రతి ఒక్కరి జీవితం కథ గా మారేది ఈ క్లాస్ రూం లోనే అంటూ టీజర్ మొదలు అవుతుంది. పదవ తరగతి లో మొదలైన ప్రేమ 1999 కాలం నాటి ప్రేమ కథ మళ్ళీ 2021 లో ఏ విధంగా మారిపోయింది. పరిస్థితులు ఎలా మారాయి, రీ యూనియన్ కాన్సెప్ట్ తో అన్ని రకాల ఎమోషన్స్ ను చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

చాందిని కోసం శ్రీరామ్ గత 20 ఏళ్లుగా ఎదురుచూస్తుంటాడు. ఆ సమయం ఎప్పుడొస్తుందా? అని కోరుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో రీ యూనియన్ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని దానికి స్నేహితుల్ని అందరిని ఆహ్వానించాలని తన స్నేహితురాలు హిమజతో చెబుతాడు. ఐడియా బాగుంది అంటుంది హిమజ. ఇంతకీ చాందిని శ్రీరామ్ ప్లాన్ చేసిన రీ యేనియన్ కి వచ్చిందా? .. హాఫ్ బాయిల్ ఎవరు? ..చాందిని - శ్రీరామ్ ల మధ్య ఏం జరిగింది? .. తన వల్ల చాందిని జీవితం నాశనం అయిందని శివబాలాజీ ఎందుకు శ్రీరామ్ ని దూషించాడు అన్నది ఆసక్తికరంగా వుంది.  

హీరో హీరోయిన్ మధ్యన 10 వ తరగతి లో ఉన్న సన్నివేశాలు, హీరోయిన్ పాత్ర ను మిస్టీరియస్ గా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. హీరో హీరోయిన్ కి సారీ చెప్పేందుకు బయలు దేరి, ఎలా చివరకు ముగుస్తుంది అనేది కథ గా ఉంది. ఈ చిత్రం టీజర్ ఆద్యంతం ఇంట్రస్టింగ్ గా ఉండటం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

‘గరుడ వేగ’ అంజి మాట్లాడుతూ – ‘‘ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘రోజ్‌ విల్లా, ‘ముగ్గురు మొనగాళ్లు’ తర్వాత మేం చేస్తోన్న మూడో చిత్రం ఇది. టెన్త్‌ క్లాస్‌ చదివిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు అచ్యుత రామారావు.

click me!