మణికర్నికలో ఆ సీన్లు కీలకమట!

Published : Sep 18, 2017, 03:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మణికర్నికలో ఆ సీన్లు కీలకమట!

సారాంశం

కంగనా లీడ్ రోల్ లో ‘మణి కర్నిక’ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మణి కర్నిక కథను అందించిన విజయేంద్ర ప్రసాద్

ఝాన్సీ రాణి లక్ష్మిభాయి జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ మణికర్నిక’. ఈ సినిమాలో ఝాన్సీ రాణి పాత్ర బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోషిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.

 

బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్.. తెలుగుతోపాటు బాలీవుడ్ లోనూ కథలు అందిస్తూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే  బాలీవుడ్ లో భజరంగీ భాయిజాన్ లాంటి కథను అందించిన  విజయేంద్ర ప్రసాద్.. తాజాగా మణికర్నిక సినిమా కి కూడా కథ అందిస్తున్నారు.

 

ఇప్పటికే సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల చిత్రీ కరణ ముగిసిదంట. ఈ సినిమాలో కొన్ని యుద్ధ సన్నివేశాలు ఉన్నాయని.. అవి సినిమాకు చాలా కీలకమని స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆ సన్నివేశాలు చక్కగా రావడానికి చిత్ర బృందం బాగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

PREV
click me!

Recommended Stories

AALoki : అల్లు అర్జున్ దూకుడు, లోకేష్ కనగరాజ్ తో 23వ సినిమా ఫిక్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్
కూల్‌గా కనిపించే ప్రభాస్‌కు కోపం వస్తే చేసేది ఇదే.! అసలు విషయం చెప్పేసిన హీరో గోపిచంద్