`వార్ 2` టీజర్: నా గురించి నీకు తెలియదు, హృతిక్‌కి ఎన్టీఆర్‌ వార్నింగ్‌.. 1000 కోట్ల మూవీ లోడింగ్‌

Published : May 20, 2025, 11:40 AM ISTUpdated : May 20, 2025, 11:55 AM IST
జూ ఎన్టీఆర్‌

సారాంశం

 ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన `వార్ 2` సినిమా టీజర్ మంగళవారం విడుదలైంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ టీజర్ ని రిలీజ్ చేసింది.

వార్ 2 టీజర్ రిలీజ్: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన `వార్ 2` సినిమా టీజర్ విడుదలైంది. యష్ రాజ్ ఫిల్మ్స్ తమ యూట్యూబ్ ఛానల్ లో టీజర్ ని రిలీజ్ చేసి ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 1.34 నిమిషాల నిడివి గల ఈ టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరూ అదరగొట్టేశారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది.

ఎన్టీఆర్‌, హృతిక్‌ల `వార్‌ 2` టీజర్‌ ఎలా ఉందంటే?

ఇక టీజర్‌ని చూస్తే `నా కళ్లు నిన్ను ఎప్పట్నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్‌. ఇండియా బెస్ట్ సోల్జర్‌. రా లో బెస్ట్ ఏజెంట్‌ నువ్వే, కానీ ఇప్పుడు కాదు. నీకు నా గురించి తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటావ్‌. గెట్‌ రెడీ ఫర్‌ వార్‌` అంటూ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ సాగింది. 

ఇందులో ప్రారంభంలో తారక్‌ పాత్రని హైలైట్‌ చేశారు. ఎన్టీఆర్‌ వార్‌కి రెడీ అనే సమయంలో హృతిక్‌ ఎంట్రీని చూపించారు. ఆయన ఎంట్రీ అదిరిపోయింది. ఇక తారక్‌ యాక్షన్‌ సీన్లు కూడా మతిపోయేలా ఉన్నాయి. ఫైనల్‌గా హృతిక్‌ కోసం తారక్‌ వేట అని టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. 

హృతిక్‌, ఎన్టీఆర్‌ ల మధ్య బిగ్‌ వార్‌

ఒకప్పుడు బెస్ట్ రా ఏజెంట్‌గా ఉన్న హృతిక్‌ ఇప్పుడు విలన్‌గా మారతాడని, అతన్ని పట్టుకునేందుకు తారక్‌ స్పై ఏజెంట్‌గా రంగంలోకి దిగుతాడని టీజర్‌ని చూస్తుంటే, ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ చూస్తుంటే తెలుస్తుంది. అంతేకాదు చివర్లో వీరిద్దరి మధ్య ఫైట్‌ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది.  

టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. భారీ యాక్షన్‌ ప్యాక్డ్ టీజర్‌ ఉంది. సినిమాలోనూ యాక్షన్‌ సీన్లు అదిరిపోయేలా ఉన్నాయి. తారక్‌ మొదటిసారి ఇలాంటి స్పై యాక్షన్‌ మూవీ చేయడం. దీంతో ఆయన పాత్రపై ఆసక్తి నెలకొంది. ఆయన సీన్లు కూడా ఫ్యాన్స్ కి ట్రీట్‌లా ఉన్నాయి.  టీజర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. చూడబోతుంటే మరో వెయ్యి కోట్ల మూవీ లోడ్‌ అవుతుందని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్