హీరోయిన్‌కి అందరి ముందు సారీ చెప్పిన అమితాబ్‌ బచ్చన్‌.. బిగ్‌ బీ చేసిన తప్పేంటంటే

Published : May 19, 2025, 10:11 PM IST
హీరోయిన్‌కి అందరి ముందు సారీ చెప్పిన అమితాబ్‌ బచ్చన్‌.. బిగ్‌ బీ చేసిన తప్పేంటంటే

సారాంశం

ఒక మ్యాగజైన్ షూట్ టైంలో అమితాబ్ బచ్చన్ లేటుగా వచ్చి అను అగర్వాల్ కి సారీ చెప్పిన సంగతిని ఆవిడే చెప్పారు.  

పాపులర్‌ హిందీ నటి అను అగర్వాల్ 1990లో వచ్చిన 'ఆషిఖీ' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అను ఒక్క రాత్రిలోనే స్టార్ అయిపోయారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అను ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. సెట్‌లో అమితాబ్‌ బచ్చన్‌ తనకు సారీ చెప్పిన విషయాన్ని బయటపెట్టింది.  ఒకసారి మ్యాగజైన్ షూటింగ్‌కి వెళ్ళినప్పుడు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆవిడకి సారీ చెప్పారట.

అమితాబ్ సారీ చెప్పడానికి కారణం బయటపెట్టిన అను అగర్వాల్ 

అను అగర్వాల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'ఒకసారి నేను అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఒక మ్యాగజైన్ కవర్ షూట్‌కి వెళ్లాను. నేను టైం కి వెళ్లాను కానీ ఆయన 20 నిమిషాలు లేటుగా వచ్చారు. వచ్చీరాగానే నా దగ్గరికి వచ్చి సారీ చెప్పారు. 

'సారీ, ఏం చేస్తాం! నీ ఫేస్ అంతా రోడ్డు మీద ఉంది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది' అని అన్నారు. నా పెద్ద పోస్టర్ అంతటా ఉంది, దాని మీద 'ఈ ఫేస్ జనాల్ని ఆపుతుంది' అని రాసి ఉంది. అసలే నా ఫేస్ అందరికీ తెలుసు, ముందు నుంచీ మోడలింగ్ చేస్తున్నాను కదా` అని వెల్లడించింది అను. 

అను అగర్వాల్ కి పూర్తి పారితోషికం ఇవ్వలేదట మేకర్స్

'ఆషిఖీ' సినిమా మేకర్స్ ఇప్పటికీ పూర్తి పారితోషికం ఇవ్వలేదని అను చెప్పారు. 60 శాతం మాత్రమే ఇచ్చారట, మిగతా 40 శాతం ఇవ్వలేదట. `ఆషిఖీ' తర్వాత అను కొన్ని సినిమాల్లోనే నటించారు. 1999లో ఆవిడకి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. 

ఆ యాక్సిడెంట్ లో ఆవిడ జ్ఞాపకశక్తి పోయింది. శరీరం పక్షవాతం అయిపోయింది. యాక్సిడెంట్ వల్ల ఆవిడ ముఖం కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు ఆవిడని చూసి గుర్తుపట్టడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె పంచుకున్న ఈ విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్
Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?