రేవంత్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ క్షమాపణలు, కారణం ఏంటంటే?

Published : Aug 11, 2025, 12:38 AM ISTUpdated : Aug 11, 2025, 12:40 AM IST
NTR apologizes to Revanth Reddy

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు తెలిపారు. పోలీస్ శాఖకు కూడా ఆయన స్పెషల్ గా ధన్యవాదాలు తెలిపారు.  దీనికి కారణం ఏంటంటే? 

బ్రహ్మాస్త్రా ఫేమ్, బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ వార్ 2. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈసినిమా ఆగస్ట్ 14వ తేదీన రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ ను పెంచేసింది. ఇందులో భాగంగా ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు లాంటి టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో కొన్ని విషయాలు మర్చిపోయిన ఎన్టీఆర్ ఆతరువాత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చిన్న తప్పు జరిగిందంటూ ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే?

రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ క్షమాపణలు

ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తర్వాత వార్ 2 ఈవెంట్‌లో తప్పు జరిగిందంటూ ఎన్టీఆర్ స్పెషల్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కలకలంరేపుతోంది. అందులో ఆయన ఏమన్నారంటే... 'అందరికీ నమస్కారం.. ఇందాక ఈవెంట్ లో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచిపోయాను. నన్ను క్షమించాలి. అభిమానులతో పాతిక సంవత్సరాల జర్నీని పంచుకునే ఆనందంలో ఒక తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, వారి సహయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఙతలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారికి , ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి నా కృతజ్ఞతలు, శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మీ సహాయ సహకారాలు మాకు అందించినందుకు ధన్యవాదాలు' అంటూ ఎన్టీఆర్ ముగించారు.వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన ప్రసంగంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పోలీస్ శాఖను ప్రస్తావించకపోవడాన్ని కార్యక్రమం ముగిసిన తర్వాత ఎన్టీఆర్ గుర్తించారు. ఆ వెంటనే తప్పును సరిదిద్దుతూ స్పెషల్ వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

 

కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్

“25 సంవత్సరాల క్రితం ‘నిన్ను చూడాలని’తో నా ప్రయాణం మొదలైంది. రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్ లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. 25 ఏళ్ల క్రితం ఆ సినిమా ఓపెనింగ్ కోసం వెళ్లినప్పుడు మొదటిరోజు షూటింగ్‌కు మా నాన్న, అమ్మ మాత్రమే వచ్చారు. కానీ ఆ రోజున వచ్చిన అభిమాని మూజీబ్ ఇంకా నాతోనే ఉన్నాడు. ఇంతమంది అభిమానులు ఉండడం నా అదృష్టం. ఈ సినిమా ప్రతి ట్విస్ట్‌ను థియేటర్లోనే చూసేయండి. బయటకు పోనివ్వకండి. పెద్దాయన ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకూ నన్ను ఎవరు ఆపలేరు, డబుల్ కాలర్ ఎగరేస్తున్నా.. కుమ్మేద్దాం. మళ్లీ వార్ 2 సక్సెస్ మీట్ కు కలుద్దాం” అని అన్నారు ఎన్టీఆర్.

వార్ 2 చేయడానికి అసలైన కారణం

“ఈ సినిమా కథ కాదు, టెక్నికల్ టీం కాదు – దీనికి అసలైన కారణం ఆదిత్య చోప్రా గారు. ‘ఈ సినిమా నువ్వు చేయాలి. నీ అభిమానులు గర్వపడేలా తీయాలని నేను చూస్తా’ అని ఆయన చెప్పినప్పుడు నాకు పూర్తి భరోసా వచ్చింది,” అన్నట్టుగానే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుని, సినిమాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. అందుకోసం ఆదిత్య చోప్రా గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ అని ఎన్టీఆర్ తెలిపారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?