తుఫాను అంచున తపస్సు చేసే వశిష్టుడు.. ట్రెండింగ్‌లో వాల్తేర్‌ వీరయ్య టైటిల్‌ సాంగ్‌..

Published : Dec 26, 2022, 09:46 PM ISTUpdated : Dec 26, 2022, 09:47 PM IST
తుఫాను అంచున తపస్సు చేసే వశిష్టుడు.. ట్రెండింగ్‌లో వాల్తేర్‌ వీరయ్య టైటిల్‌ సాంగ్‌..

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య` మరో అదిరిపోయే సాంగ్‌ వచ్చింది. మెగాస్టార్‌ వీరత్వాన్ని ఆవిష్కరించేలా సాగే టైటిల్‌ ట్రాక్‌ తాజాగా విడుదలైంది. 

మెగాస్టార్‌ చిరంజీవి ఈ సంక్రాంతి `వాల్తేర్‌ వీరయ్య` సినిమాతో రాబోతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. చిరంజీవి మార్క్ మాస్‌ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుంది. రవితేజ కీలక పాత్రలో, శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తి చేసుకుంది. ఫారెన్‌లో ఓ సాంగ్‌ చిత్రీకరణ జరుపుకుంటుంది. దీంతో మొత్తం షూటింగ్‌ పూర్తి కానుంది. సంక్రాంతి 13కి సినిమా రిలీజ్‌ కానున్న నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచింది చిత్ర బృందం. వరుసగా పాటలను విడుదల చేస్తూ అలరిస్తున్నారు. 

ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు. ఓ మాస్‌ బీట్‌, మరో క్లాస్‌ బీట్‌ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో పాటని విడుదల చేశారు. `వాల్తేర్‌ వీరయ్య` టైటిల్‌ సాంగ్‌ని సోమవారం సాయంత్రం రిలీజ్‌ చేశారు. `తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ణుడు` అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేయగా అది యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటని చంద్రబోస్‌ రాశారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యాలు సమకూర్చారు. 

ఈ పాటని అనురాగ్‌ కులకర్ణ అలాప్‌, పవిత్ర చారి ఆలపించారు. దీనికి బ్రాస్‌ ఆర్కేస్ట్రా సంస్థ బ్యాంకాక్‌ కి చెందిన ఆర్కేస్ట్రా బృందాలతో కలిసి పనిచేయడం విశేషం. ఇక వాల్తేర్‌ వీరయ్య వీరత్వాని, పరాక్రమాన్ని ఆవిష్కరించేలా సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. మెగా ఫ్యాన్స్ అదిరిపోయే ట్రీట్‌ లా ఉంది. గత పాట విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం కాగా, ఆ లోటుని ఈ పాట భర్తీ చేసింది. చిరంజీవి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. ఇందులో చిరంజీవి లుక్స్ అదిరిపోయాయి. సినిమాపై ఈ పాట అంచనాలు భారీగా పెంచేస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ram charan మీద దేశాలు దాటిన ప్రేమ, మెగా పవర్ స్టార్ కోసం ఇండియా వచ్చిన ఫారెన్ అభిమానులు
పొగరు అనుకున్నా పర్లేదు.! రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఆఫర్ అందుకే రిజెక్ట్ చేశా