
మెగా ఫ్యాన్స్ కు దర్శకుడు వివివినాయక్ క్షమాపణ చెప్పారు. అవును మీరు వింటున్నది నిజమే. మెగా స్టార్ వీరాభిమాని, స్టార్ దర్శకుడు వివి వినాయక్ మెగా అభిమానులకు మనస్పూర్తిగా క్షమాపణ చెప్పారు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 చిత్రం నేటితో వంద రోజుల పండగ జరుపుకుంటోంది.
మెగాస్టార్ ఫ్యాన్స్ తరపున గుంటూరులో వంద రోజుల సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే మెగా దర్శకుడు వివినాయక్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ప్రస్థుతం హైదరరాబాద్ లోనే ఉన్న వినాయక్ 100 రోజుల వేడుకలకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు.
అయితే తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీ నెంబర్ 150 వంద రోజుల వేడుకలకు హాజరు కాలేకపోతున్నందుకు, మెగా అభిమానులు తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని వినాయక్ పేర్కొన్నారు. తాను రాలేక పోతున్నందుకు క్షమాపణ కోరుతున్నానని వినాయక్ తెలిపారు.