రౌడీ హీరో విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం VD13. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా పూర్తైన విషయం తెలిసిందే. తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చివరిగా ‘లైగర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నా అంతా రీచ్ కాలేకపోయింది. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై విజయ్ పోకస్ పెట్టారు. శరవేగంగా ఒక్కో సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ చిత్రాన్ని పూర్తి చేశారు. అటు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 షూట్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇక రీసెంట్ గా ప్రకటించిన VD13 షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ అప్డేట్ అందించారు. ‘గీతా గోవిందం’ డైరెక్టర్ పరుశురామ్ పెట్ల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. జూన్ 14న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. రెగ్యూలర్ షూటింగ్ ను ఈ నెలలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. తాజాగా అప్డేట్ ఇస్తూ షూటింగ్ కు సంబంధించిన లోకేషన్స్ ఎంపికై పూర్తైనట్టు తెలిపారు.
విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. వీరిద్దరి కాంబోలో రెండో సినిమా రాబోతుండటంతో ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. పైగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. సినిమాను నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించబోతోన్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన లొకేషన్ల వేట కూడా పూర్తవడంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతోన్నామని మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ ఫోటోను వదిలింది. ఇందులో టీం అంతా కూడా నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. దిల్ రాజు, పరుశురామ్ ఇతర సాంకేతిక నిపుణులు లొకేషన్ల వేటను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 54 వ చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది ఈ చిత్రం.
Team and is ready to roll…🥳 🎥
Wrapped up location reccee in the USA and gearing up for shoot🎥
Stay tuned for more updates... … pic.twitter.com/bX0lhmw2Zv