వైజాగ్ ప్రసాద్ కోలుకుంటారని అనుకున్నారు.. కానీ

By Prashanth MFirst Published Oct 21, 2018, 12:44 PM IST
Highlights

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి వైజాగ్ ప్రసాద్. రంగస్థలం నాటకాల్లో తన టాలెంట్ ను నిరూపించుకొని వెండితేర వరకు వచ్చిన ఆయన జీవితం టీవీ సీరియల్స్ వరకు బాగానే సాగింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి వైజాగ్ ప్రసాద్. రంగస్థలం నాటకాల్లో తన టాలెంట్ ను నిరూపించుకొని వెండితేర వరకు వచ్చిన ఆయన జీవితం టీవీ సీరియల్స్ వరకు బాగానే సాగింది. నేడు ఉదయం ఆయన హఠాన్మరణం టాలీవుడ్ ప్రముఖులను ఎంతో షాక్ కి గురి చేసింది. 

వైజాగ్ ప్రసాద్ పూర్తి పేరు కొర్లాం పార్వతీ వరప్రసాద రావు. విశాఖపట్నంలోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తి. ఇక  ముగ్గురు అమ్మాయిల తరువాత జన్మించిన ప్రసాద్ ఊహ తెలియకముందే తల్లిని కోల్పోయాడు. నాటక రంగం నుంచి సినీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టారు. 

తెలియకుండానే ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 1983లో కామెడీ డైరెక్టర్ జంధ్యాల ద్వారా సినీ నటుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టారు. బాబాయ్ అబ్బాయ్ సినిమా నుంచి రెండేళ్ళ క్రితం వచ్చిన సీరియల్స్ వరకు నటుడిగా బిజీగానే ఉన్నారు. 175 సినిమాలకు పైగా నటించారు.  వైజాగ్‌ నుంచి వచ్చారు కాబట్టి వైజాగ్‌ ప్రసాద్‌గా ఆయన పేరు సినీ ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది. 

రెండేళ్ల నుంచి చిక్కిత్స అందుకుంటున్న ప్రసాద్ కొన్ని నెలల క్రితం కోలుకుంటున్నట్లు అంతా బావిందరు. అయితే ఊహించని విధంగా గుండె పోటుతో మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఆయన నేడు తెల్లవారుజామున సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చిక్కిత్స పొందుతూ మృతి చెందారు. 

 సంబంధిత వార్తలు 

సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

click me!