కమల్ విశ్వరూపం-2కి సెన్సార్ క్లియరెన్స్

Published : Mar 17, 2018, 01:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
కమల్ విశ్వరూపం-2కి సెన్సార్ క్లియరెన్స్

సారాంశం

'విశ్వరూపం 2'కి తొలగిన అడ్డంకులు  యూఎస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి జూన్ లో భారీస్థాయిలో విడుదల

కమల్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'విశ్వరూపం' ఒకటి. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, కమల్ చేసిన సాహసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. దాంతో కమల్ ఈ సినిమాకి సీక్వెల్ ను కూడా సిద్ధం చేశారు. అయితే కొన్ని ఆర్ధిక పరమైన లావాదేవీల కారణంగా ఈ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది.

ఈ సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో కమల్ గట్టి ప్రయత్నమే చేశారు. ఆయన ప్రయత్నాలు ఫలించి .. అడ్డంకులు తొలగిపోయి, ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. యూఎస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమాను, తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో జూన్ లో విడుదల చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఓటీటీలో తప్పక చూడాల్సిన 7 డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్
Jacqueliene Fernandez: కేన్స్‌లో మరోసారి జాక్వెలిన్ మాయ.. రాహుల్ మిశ్రా డ్రెస్‌లో గ్లామర్ షో