
మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. తనదైన స్టయిల్‌లో దూసుకుపోతున్నాడు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రేజీ మూవీస్‌తో రాణిస్తున్నాడు. అయితే ఆయన ప్రెగ్నెంట్ కావాల్సింది. కానీ జస్ట్ లో మిస్ అయ్యింది. దీంతో ఆ పోస్ట్ ని బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ దక్కించుకోవడం విశేషం. మరి ఈ ప్రెగ్నెంట్ గొడవేంటి? ఎందుకు ప్రెగ్నెంట్ కావాల్సిందనేది చూస్తే.. ప్రస్తుతం బిగ్ బాస్ నాల్గో సీజన్‌తో పాపులర్ అయిన సోహైల్ హీరోగా `మిస్టర్ ప్రెగ్నెంట్` అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ చిత్రాన్ని రూపొందించారు. అప్పిరెడ్డి, వెకంట్ అన్నపరెడ్డి, రవీందర్‌రెడ్డిలు నిర్మించారు. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కావాల్సింది.
అయితే ఈ సినిమాకి సంబంధించిన తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. `మిస్టర్ ప్రెగ్నెంట్`లో ముందుగా సోహైల్ కంటే ముందు విశ్వక్ సేన్‌ని తీసుకోవాలనుకున్నారట. ఇలాంటి ప్రయోగాత్మక కథని నోటెడ్ హీరో చెబితే బాగుంటుందని విశ్వక్ సేన్‌ని సంప్రదించారట. ఆయన కూడా తన ఆసక్తిని వెల్లడించారు. కానీ పూర్తి కథ చెప్పలేదు. ఫుల్ స్క్రిప్ట్ చెబితే విశ్వక్ సేన్ చేసేవాడు. కానీ దర్శకుడు సోహైల్‌కి చెప్పాడు. సోహైల్.. దర్శకుడికి మంచి స్నేహితుడు కావడంతో ఈ కథని ముందుగా సోహైల్‌కి చెప్పారు. కానీ ఆ టైమ్‌లోనే బిగ్ బాస్‌లోకి వెళ్లారు. ఈ గ్యాప్‌లో విశ్వక్‌సేన్‌కి ఈ లైన్ చెప్పారట. విశ్వక్ పాజిటివ్‌గానే ఉన్నారు. అయితే ఈ లోపే మంచి పాపులారిటీతో సోహైల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు. దీంతో తన కథకి ఆయన బాగా సెట్ అవుతాడని, ప్రెగ్నెంట్ రోల్‌కి తనే పర్‌ఫెక్ట్ అని తాను భావించినట్టు దర్శకుడు శ్రీనివాస్ తెలిపారు.
అలాగే విశ్వక్ సేన్‌తో కాకుండా సోహైల్‌తో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. నిర్మాతలు కూడా సోహైల్‌పై ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమా సెట్ అయ్యింది. సో అలా విశ్వక్ సేన్ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ని కోల్పోయారు. సోహైల్ ఆ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రెగ్నెంట్ మహిళల బాధలు, వారి ఎమోషన్స్ ని తెలియజేసేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శకుడు తెలిపారు. గర్భం సమయంలో మహిళలు బాధలు, ఆనందాలను ఇందులో చూపించారు. అయితే మగవాళ్లు ప్రెగ్నెంట్ అయితే వాళ్లు ఎలా ఫీలవుతారనేది ఇందులో కొత్తగా చూపించబోతున్నట్టు తెలిపారు దర్శకుడు.
`నా పర్సనల్ లైఫ్ లోని ఈవెంట్స్ కొన్ని ఈ చిత్ర కథ రాసేందుకు ఇన్స్ పైర్ చేశాయి. నా వైఫ్ ప్రీ మెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది. ఆ బేబీ బాగా చూసుకునేందుకు ఆమె ఎంత కష్టపడింతో ప్రత్యక్షంగా చూశాను. థామస్ అనే మేల్ ప్రెగ్నెంట్ యూఎస్ లో ఉన్నాడని పేపర్ లో చదివాను. అప్పటి నుంచి ఈ తరహా కథ ఒకటి రాయాలని ప్రయత్నాలు ప్రారంభించాను. ప్రెగ్నెన్సీ టైమ్ లో వుమెన్ కష్టాన్ని చూపిస్తే ఆర్ట్ ఫిలిం అవుతుంది. అలా కాకుండా ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ తో మంచి లవ్ స్టోరితో కలిపి చేశాం. అయితే మేల్ ప్రెగ్నెంట్ అనగానే అందరు వింతగా రియాక్ట్ అవుతారు. ప్రేక్షకులు కూడా అలాగే మొదట సర్ ప్రైజ్ అవుతారు కానీ ఇందులోని ఎమోషన్స్ కు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం. మైక్ మూవీస్ ప్రొడ్యూసర్స్ మూవీ మేకింగ్ లో అన్ని విధాలా నాకు సపోర్ట్ చేశారు. మంచి టెక్నీషియన్స్ ను ఇచ్చారు. కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఔట్ పుట్ చూశాక వారు సంతోషంగా ఉన్నారు. నేను కథ ఎలా చెప్పానో అలాగే బాగా తెరకెక్కించాని ప్రొడ్యూసర్స్ చెప్పడం హ్యాపీగా అనిపించింది` అని తెలిపారు.
`తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా చేశామనే పేరొస్తుంది. ఇప్పుడే కాదు పదేళ్ల తర్వాత మా సినిమా చూసినా ఇష్టపడతారు. కాలేజ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రేక్షకులతా మా సినిమాకు కనెక్ట్ అవుతారు. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తర్వాత హీరో హీరోయిన్ల క్యారెక్టర్ లతో ప్రేక్షకులంతా ట్రావెల్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్ 45 మినిట్స్ సీట్స్ నుంచి కదలకుండా చూస్తారు. అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది` అని చెప్పారు. దీంతోపాటు ఈ సినిమాకి టికెట్ రేట్లని కూడా తగ్గిస్తున్నట్టు చెప్పారు.