AVAK: OTT రిలీజ్ విషయమై విశ్వక్‌ సేన్‌ వివరణ (వీడియో)

Surya Prakash   | Asianet News
Published : May 09, 2022, 12:53 PM IST
AVAK:  OTT రిలీజ్ విషయమై విశ్వక్‌ సేన్‌  వివరణ (వీడియో)

సారాంశం

 నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి. మా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది.. మేం అనౌన్స్ చేస్తాం. డేట్ వేసేసి అన్ని చెప్పేసి.. సినిమా థియేటర్లకు వచ్చేవాళ్లను చెడగొట్టకండి. 


సినిమా రిలీజైన వెంటనే ఫలానా రోజు ఓటిటి రిలీజ్ అంటూ టాక్ ప్రారంభం అవుతోంది. అదే విధంగా  విశ్వక్‌ సేన్‌  తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం' ఓటిటి డేట్ అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నమ్మి ఎలాగో ఓటిటి లో రిలీజ్ అవుతుందిలే అనే ఉద్దేశ్యంలో జనాలు థియోటర్ కు వెళ్లటం ఆపేస్తారేమో అనే ఆలోచన హీరో విశ్వక్ సేన్ కు కలిగింది. వెంటనే  అలాంటి ఓటిటి రిలీజ్ డేట్ ఏమీ లేదంటూ వివరణ ఇస్తూ వీడియో రిలీజ్ చేసారు.

ఈ వీడియోలో ...‘‘ నమస్తే అందరికీ.. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థాంక్యూ సో మచ్, థియేటర్ వరకు వచ్చి నా సినిమా చూస్తున్నందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. అందరూ కూడా నాకు హోప్ ఇచ్చినందుకు సినిమాలు తీయడానికి.అయితే నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి. మా సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది.. మేం అనౌన్స్ చేస్తాం. డేట్ వేసేసి అన్ని చెప్పేసి.. సినిమా థియేటర్లకు వచ్చేవాళ్లను చెడగొట్టకండి. నిజం చెప్పాలంటే ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో నాకే తెలియదు. అన్నారు.

మేమే ఇంకా ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేము ఫిక్స్‌ అయిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తాం. ప్రస్తుతానికి సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. కాబట్టి సోషల్‌మీడియాలో ఓటీటీ రిలీజ్‌పై పోస్టులు పెట్టే వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. థియేటర్‌లో సినిమా చూస్తే వచ్చే అనుభవం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని మిస్‌ కాకండి. మీరు ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తే థియేటర్‌లో సినిమా చూడాలనుకునేవారు కూడా ఓటీటీ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు సినిమాహాళ్లకు రారు. కాబట్టి, మీరు పెట్టిన పోస్టుల్ని దయచేసి డిలీట్‌ చేసేయండి. రూమర్స్‌ వ్యాప్తి చేయకండి’’ అని విశ్వక్‌ వివరించారు.

ఇక విశ్వక్ సేన్‌ సరసన రుక్సార్‌ దిల్లాన్ హీరోయిన్‌గా అలరించిన ఈ మూవీకి  విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్‌లు, టీజర్‌, ట్రైలర్‌ విభిన్నంగా ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన చర్యలు పలు విమర్శలను కూడా మూటగట్టుకున్నాయి. విశ్వక్ సేన్‌కు ఓ టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన కాంట్రవర్సీ తెలిసిందే.  ఆ ప్రమోషన్ తో అశోకవనంలో అర్జున కల్యాణం థియేటర్లలో విడుదలైంది.  అల్లం అర్జున్‌గా విశ్వక్ సేన్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి.   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?