`గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` మొదట చేయాల్సిన హీరో ఎవరో తెలుసా?.. విశ్వక్‌ సేన్‌ వద్దకు రావడం వెనుక కథేంటి?

Published : May 29, 2024, 06:04 PM IST
`గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` మొదట చేయాల్సిన హీరో ఎవరో తెలుసా?.. విశ్వక్‌ సేన్‌ వద్దకు రావడం వెనుక కథేంటి?

సారాంశం

`గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` మూవీ మొదట చేయాల్సిన హీరో విశ్వక్‌ సేన్‌ కాదు, మరో హీరో వద్దకు వెళ్లింది. మరి ఆయన ఎవరు? ఎందుకు రిజెక్ట్ చేశాడు, విశ్వక్‌ సేన్‌ వద్దకు ఎలా వచ్చిందంటే?  

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హీరోగా `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీ నెల 31న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయాలు వెల్లడించారు దర్శకుడు కృష్ణ చైతన్య. 

హీరో విశ్వక్‌ సేన్‌ చేయడానికి ముందు ఈ కథ మరో హీరో వద్దకు వెళ్లిందట. ఆ విషయాలను పంచుకున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య మొదట ఈ కథని హీరో శర్వానంద్‌కి చెప్పారట. తన గత సినిమాలు రెండూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. శర్వానంద్‌ ఎమోషనల్‌ ఫిల్మ్స్ చేశాడు. దీంతో మళ్లీ అలాంటి హైఎమోషనల్‌ మూవీ చేస్తే బాగోందని శర్వానంద్‌ రిజెక్ట్ చేశాడట. రెండు సినిమాల తర్వాత ఇది చేద్దామన్నాడట శర్వా.

 దీంతోపాటు  `పవర్‌ పేట` అనే ఓ కథని కూడా అనుకున్నాడు. ఆ మూవీ కూడా పట్టాలెక్కలేదు. బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు ఆ మూవీని చేసేందుకు ధైర్యం చేయలేదు.  ఆ టైమ్‌లో కృష్ణ చైతన్య తన గురువు త్రివిక్రమ్‌ కి ఈ విషయం చెప్పడంతో విశ్వక్‌ సేన్‌ కి సజెస్ట్ చేశాడట. ఆయనకు ఈకథ బాగా నచ్చింది. దీంతో వెంటనే పట్టాలెక్కింది. ఈ మూవీ రావడంలో త్రివిక్రమ్‌ సపోర్ట్ ఎంతో ఉంది, ఆయన లేకపోతే ఈ మూవీ లేదన్నారు. అంతేకాదు సినిమా షూటింగ్‌ దశలో, రషెస్‌ కూడా చూసి ఆయన సలహాలు ఇచ్చారు, ఏది బాగుందో ఏది బాగా లేదో తెలిపారు, దాని ప్రకారంగానే సినిమా చేసినట్టు తెలిపారు.

విశ్వక్‌ సేన్‌ ఎలా చేస్తాడో అనుకున్నాం. కానీ ఇరగదీశాడని, ఊహించిన దానికంటే బాగా చేశాడని తెలిపారు. తమిళ డీటీఎస్‌ మిక్సింగ్‌ చేసే టెక్నీషియన్‌ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాడని, సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు తెలిపాడు. అయితే విశ్వక్‌ గోదావరి యాసని పట్టుకుంటాడా లేదా అనేది ఉండేది, నెల రోజుల్లోనే నేర్చుకున్నాడని తెలిపారు. 

`గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` అంటే గ్యాంగ్‌ స్టర్‌ మూవీ కాదని చెప్పారు. గోదావరి జిల్లాల్లో ఉండే ఓ గ్యాంగ్ ల మధ్య గొడవ అని చెప్పారు. తెలంగాణ, రాయలసీమలో ఎలా అయితే మర్డర్లు ఉన్నాయో, గోదావరి జిల్లాల్లోనూ హత్యలు ఉంటాయని, ఇప్పటి వరకు సినిమాల్లో గ్రీనరీ, కొబ్బరి చెట్లే చూపిస్తారు, కానీ అక్కడ రక్తపాతం కూడా ఉంటుందని, అదే ఈ మూవీలో చూపించినట్టు తెలిపారు దర్శకుడు. నాలుగు గ్రూపుల మధ్య జరిగే గొడవలు, ఆధిపత్యపోరులా సినిమా సాగుతుందని, అయితే చూడ్డానికి ఇది యాక్షన్‌ మూవీలా ఉన్నా, ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌ అని చెప్పొచ్చు అన్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?