విశ్వంభర సెట్స్ లో ఊహించని అతిథి.. చిరంజీవిని సర్ప్రైజ్ చేసిన స్టార్ హీరో

Published : May 29, 2024, 02:33 PM IST
విశ్వంభర సెట్స్ లో ఊహించని అతిథి.. చిరంజీవిని సర్ప్రైజ్ చేసిన స్టార్ హీరో

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. బింబిసార డైరెక్టర్ వసిష్ఠ ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. బింబిసార డైరెక్టర్ వసిష్ఠ ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సోసియో ఫాంటసీ చిత్రంగా విశ్వంభర రూపొందుతోంది. 

త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నా సామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఆంజనేయ స్వామికి సంబంధించిన అంశాలు ఈ చిత్రంలో బలంగా ఉండబోతున్నాయి. అదే విధంగా విశ్వంలో చోటు చేసుకునే అరుదైన ఘట్టాన్ని సాధించే వీరుడిగా మెగాస్టార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే విశ్వంభర సెట్స్ లో ఊహించని అతిథి మెరిశారు. తమిళ స్టార్ హీరో తలా అజిత్ విశ్వంభర సెట్స్ ని విజిట్ చేసి మెగాస్టార్ ని కలిశారు. దీనితో విశ్వంభర టీం మొత్తం థ్రిల్ కి గురయ్యారు. చిరంజీవి, అజిత్ కాసేపు ముచ్చటించుకున్నారు. దీనితో చిరు ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

 

విశ్వంభర షూటింగ్ జరుగుతున్న ప్రదేశం పక్కనే అజిత్ కూడా తన తదుపరి చిత్ర షూటింగ్ లో ఉన్నారు. దీనితో వీళ్లిద్దరి మీటింగ్ జరిగింది. అజిత్ తొలి చిత్రం ప్రేమ పుస్తకం తో పాటు అనేక మెమొరబుల్ విషయాలని గుర్తు చేసుకున్నట్లు చిరంజీవి తెలిపారు. 

అదే విధంగా తన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో అజిత్ సతీమణి షాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ విషయాన్ని కూడా చిరు అజిత్ గుర్తు చేసుకున్నారట. ఈ సందర్భంగా చిరంజీవి అజిత్ ని ప్రశంసలతో ముంచెత్తారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్