విశ్వక్ సేన్ కొత్త సినిమా షురూ.. గ్రాండ్ గా VS10 పూజా కార్యక్రమం.. మూవీ డిటేయిల్స్ ఇవే..

By Asianet News  |  First Published Mar 19, 2023, 1:59 PM IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ కాబోతుండగా.. మరో చిత్రాన్ని ప్రారంభించారు. ఈరోజే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో సినిమా షురూ అయ్యింది.
 


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు. మినిమమ్ గ్యారంటీ సినిమాలు చేస్తున్న విశ్వక్ అన్ని జోనర్లలోని చిత్రాల్లో నటిస్తున్నారు.  గతేడాది ఏకంగా నాలుగు చిత్రాలతో అలరించిన విశ్వక్ సేన్ ఈ ఏడాది కూడా అదే జోష్ కనబరుస్తున్నారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. ఈరోజే విశ్వక్ సేన్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. 

డెబ్యూ దర్శకుడు రవితేజ ముల్లపూడి డైరెక్షన్ లో VS10లో విశ్వక్ నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామ్ తల్లూరి భారీ స్కేల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజే అధికారికంగా అనౌన్స్ చేసిన ఈ చిత్రపు పూజా కార్యక్రమాన్ని రామానాయుడు స్టూడియోలో ఇవాళ గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రొడ్యూసర్ రామ్ తల్లూరి భార్య రజినీ క్లాప్ కొట్టారు. రైటర్, ఫిల్మ్ మేకర్ మచ్చ రవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత రామ్ స్క్రిప్ట్ ను డెబ్యూ డైరెక్టర్ రవితేజకు అందించారు. అనంతరం విశ్వక్ సేన్ - మీనాక్షి చౌదరిపై ముహుర్తపు షాట్ ను తీశారు.

Latest Videos

మొత్తానికి గ్రాండ్ గా విశ్వక్ సేన్ తదుపరి చిత్రం కూడా గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ చిత్రం ఫుల్ ఫన్ రైడ్ గా ఉంటుందని తెలిపారు. చిత్రం కోసం నోటెడ్ టెక్నిషీయన్స్ పనిచేస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా,  మనోజ్ కటసాని కెమెరా బాధ్యతలు  చూస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్ గా, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్ గా, సత్యం రాజేష్ మరియు విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. 

ఉగాది పర్వదినాన ప్రేక్షకులకు ముందుకు ‘దాస్ కా ధమ్కీ’తో విశ్వక్ సేన్ ప్రేక్షకులను అలరించబోతున్నారు. వాన్మయ్ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాన్ బ్యానర్లపై నిర్మించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రాన్ని మార్చి 22న అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. విశ్వక్ సేన్ - నివేతా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా నటించారు. రావు రమేశ్, తరుణ్ భాస్కర్, పృథ్వీ రాజ్, హైపర్ ఆది, మహేశ్ ఆచంట కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్, పాటలు హైప్ పెంచాయి. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ సైతం చీఫ్ గెస్ట్ గా రావడంతో సినిమాపై హైప్ పెరిగింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishwaksen (@vishwaksens)

click me!