వైజాగ్ మ్యాచ్ లో నాని సందడి.. హార్దిక్ పాండ్య పిల్ల జమీందార్.. కోహ్లీ, రోహిత్ లని తన చిత్రాలతో పోల్చుతూ..

By Asianet NewsFirst Published Mar 19, 2023, 1:49 PM IST
Highlights

నేడు వైజాగ్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండవ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నేచురల్ స్టార్ నాని లైవ్ లో సందడి చేశారు.

ఇండియాలో సినిమా, క్రికెట్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినిమా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. టీమిండియా మ్యాచ్ లు జరుగుతుంటే ఆ క్రేజ్ ని హీరోలు తమ చిత్రాలకు కూడా వాడేస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తన లైగర్ చిత్రాన్ని ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. 

నేడు వైజాగ్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండవ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నేచురల్ స్టార్ నాని లైవ్ లో సందడి చేశారు. నాని నటించిన పాన్ ఇండియా చిత్రం దసరా మార్చ్ 30న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 

దీనితో దసరా ప్రమోషన్స్ కోసం నాని వైజాగ్ మ్యాచ్ లో మెరిశారు. తనకి క్రికెట్ తో ఉన్న అనుబంధాన్ని కామెంటేటర్స్ పంచుకున్నాడు. గ్రౌండ్ లో చాలా సేపు సందడి చేసిన నాని.. కామెంటేటర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చాడు. తాను చివరగా అంటే సుందరానికీ టీంతో కలసి క్రికెట్ ఆడడానని గుర్తు చేసుకున్నాడు. 

ఇక సచిన్ టెండూల్కర్ తన ఆల్ టైం ఫేవరిట్ అని పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం టీమిండియాలో కీలక ప్లేయర్లని తన సినిమాలతో పోల్చాడు. హార్దిక్ పాండ్యని పిల్లజమీందార్ అని అన్నాడు. ఇక రోహిత్ శర్మ జెంటిల్ మాన్ అని.. విరాట్ కోహ్లీ గ్యాంగ్ లీడర్ అంటూ వారికి సూట్ అయ్యే విధంగా నాని చెప్పడం విశేషం. వైజాగ్ వేదికగా మ్యాచ్ జరుగుతుండడంతో అభిమానులు స్టేడియంకి భారీ ఎత్తున తరలివచ్చారు. 

click me!