విశ్వక్ సేన్ (Vishwak Sen) కొత్త సినిమా పోస్టర్ భయంకరంగా ఉంది. మాస్ కా దాస్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ గా మారింది.
మాస్ కా దాస్ త్వరలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో అలరించబోతున్న విషయం తెలిసిందే. ఆ వెంటనే మరో సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో చివరిగా ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. ఇక నెక్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ తో కూడిన సినిమాతో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతున్నారు. తాజాగా ఆ మూవీ నుంచి విశ్వక్ లుక్ తో పాటు అప్డేట్ అందింది.
అయితే ఎప్పుడో ప్రారంభమైన ‘గామీ’ Gaami అనే చిత్రం నుంచి విశ్వక్ అప్డేట్ అందించారు. ఇదివరకే ఈ సినిమా స్టేటస్ ఏంటనేది తెలియజేశారు. ఎడిటింగ్ పూర్తైందని వెల్లడించారు. సినిమా రన్ టైమ్ ను 2 గంటల 24 నిమిషాలకు లాక్ చేసినట్టు అప్డేట్ ఇచ్చారు. ఇక తాజాగా విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ Vishwak Sen Gaami First Lookను విడుదల చేశారు. గామి, అతిపెద్ద భయం మానవ స్పర్శ.. అతని లోతైన కోరిక కూడా.. మానవ స్పర్శ.. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రత్యేకమైన కథ, అతని అతిపెద్ద భయాన్ని జయించటానికి అతని ప్రయాణంగా.. త్వరలో సినిమా థియేటర్లలోకి వస్తుంది..’ అంటూ పేర్కొన్నారు.
పోస్టర్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. పూర్తిగా నల్లటి వస్త్రాలను చుట్టుకున్న విశ్వక్ సేన్ అఘోరగా కనిపిస్తున్నారు. తీక్షణంగా చూస్తున్న అతన్ని కొన్ని చేతులు స్పర్శిస్తూ ఉండటం గమనించవచ్చు. చేతిలో ఓ ఆయుధాన్ని పట్టుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక Gaami చిత్రం అడ్వెంచర్, థ్రిల్లర్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. యూవీ క్రియేషన్స్, కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కార్తీక్ శబరీశ్ నిర్మించారు. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కలర్ ఫొటో’ హీరోయిన్ చాందిని చౌదరి Chandini Chowdary హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక విశ్వక్ సేన్ నుంచి ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ Gang of Godavari మూవీ కూడా రావాల్సి ఉంది. సంక్రాంతికి ముందుకు డిసెంబర్ లోనే రావాల్సింది. కానీ సినిమాల రద్దీతో పోస్ట్ పోన్ అయ్యింది. నెక్ట్స్ రిలీజ్ డేట్ పై మళ్లీ అప్డేట్ రావాల్సి ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ విశ్వక్ రెండు సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీని 1980లో గోదావరి నేపథ్యంలో జరిగే కథగా చిత్రీకరించారు. పొటిలికట్ డ్రామాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. డీజేటిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. హీరోయిన్ అంజలి, కమెడియన్ హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.