Latest Videos

`గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` ట్రైలర్‌.. విశ్వక్‌ సేన్‌ ఊరమాస్‌ షో..

By Aithagoni RajuFirst Published May 25, 2024, 7:46 PM IST
Highlights

విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో మాస్‌ కా దాస్‌ ఊర మాస్‌ జాతర చూపించాడని చెప్పొచ్చు. 
 

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఊరమాస్‌ సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` చిత్రంలో నటిస్తున్నాడు. ఇది విలేజ్‌ స్థాయి రాజకీయాల నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా, అంజలి కీలక పాత్రలో కనిపిస్తుంది. ఓ కొత్త తరహా పాత్రలో ఆమె కనిపించబోతుంది. ఈ మూవీ వచ్చే వారం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ విడుదల చేసింది యూనిట్‌. 

`గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. మనుషులు మూడు రకాలు అంటూ ట్రైలర్‌ ప్రారంభమైంది. ఒకటి నాసిరకం, రెండోది బోసి రకం, ఇక మూడోది నాణ్యమైన రకం అంటూ ట్రైలర్‌ సాగింది. మూడు కేటగిరిల్లో మనుషులను చూపించారు. ఆ తర్వాత విశ్వక్‌ సేన్‌ ని చూపిస్తూ వెనకాల నుంచి నువ్వెవరివీ రత్న అనే ఒక ఆడగొంతు వస్తుంది. ఆ తర్వాత నాయకుడిగా మారతాడు రత్నాకర్‌(విశ్వక్‌సేన్‌). దీంతో యువ నాయకుడు రత్నాకర్‌ అని హైపర్‌ ఆది చెప్పగా, యువ నాయకుడు, నా లౌ..ల నాయకుడు కాదురా, ఏదైనా బలంగా రాయు అని చెబుతాడు విశ్వక్‌ సేన్‌. 

అంతలోనే అంజలి పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఓరేయ్‌ దొంగనా కొడకా అని ఫైర్‌ అవుతుండగా, విశ్వక్‌సేన్‌ పరిగెడుతుండగా పోలీసులు దాడి చేసి డబ్బులను, ఆస్తులను జప్తు చేస్తుంటారు. దీంతో పోలీసులు అరెంట్‌ వారెంట్ ఇచ్చారని హైపర్‌ ఆది చెప్పగా, నా ఊళ్లో నాకేంటిరా భయం. కాసేపు ఉ.. ఆపుకో వస్తాను అని పోలీసులకు విశ్వక్‌ వార్నింగ్‌ ఇస్తాడు. ఊర్లో ప్రచారం చేస్తూ డబ్బులు, మందు సీసాలు పంచుతుంటాడు విశ్వక్‌. అప్పుడే నేహా శెట్టి ఎంట్రీ ఇస్తుంది. ఇల్దాకే ఓ దాన్ని చూశానే, పట్టుకుంటే కందిపోయిందని చెప్పగా, వదిలేయపోయావా అని అంజలి అంటుంది. 

మనసు ఇరిగిపోదానే అంటాడు విశ్వక్‌. ఆమెతో ప్రేమ, పెళ్లి వరకు వెళ్తుంది. ఈ సమస్య వాడు పోతే వాడితోనే పోతుందని నాజర్‌ పాత్ర చెప్పగా, లేదంటే ఊరే పోతుందని మరో నటుడు చెబుతాడు. ఇలాంటి సూక్తులుంటే గోడలపై రాయు.. ఉ పోసుకునేటప్పుడు సదువుతాను అని విశ్వక్‌ చెప్పడం హైలైట్‌గా నిలిచింది. అనంతరం వీరిపై ప్రత్యర్థులు దాడికి వస్తారు. వారిపై తిరగబడతాడు విశ్వక్‌ సేన్‌. ఈ క్రమంలో మన మీదికి ఎవడైనా వస్తే వాడి మీదకు పడిపోవడమే అని చెప్పడం అదిరిపోయింది. చివరగా మనుషులు మూడు రకాళ్లు రా, ఆడాళ్లు, మగాళ్లు, రాజకీయ నాయకులు అని విశ్వక్‌ సేన్‌ చెప్పడంతో ట్రైలర్‌ ముగిసింది. 

ఇందులో విశ్వక్‌ సేన్‌ ఊరమాస్‌ అవతార్‌లో అదరగొట్టాడు. తన పేరుకి, యాటిట్యూడ్‌కి తగ్గ పాత్ర, కథ పడిందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఓ రకంగా ట్రైలర్‌లో విశ్వక్‌ సేన్‌ ఊరమాస్‌ షో అని చెప్పొచ్చు. ఫన్‌, యాక్షన్‌, గ్లామర్‌ ఇలా అన్ని అంశాలతో ఈ సినిమా సాగుతుందనిపిస్తుంది. బీజీఎం కూడా అదిరింది. ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతుంది. పీరియడ్‌ అంశాలతో కోస్తాంధ్ర నేపథ్యంలో ఈ మూవీ కథ సాగుతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 31న విడుదల కాబోతుంది.  
 

click me!