Latest Videos

కొత్త సినిమా కమిటైన హరీష్ శంకర్, హీరో, నిర్మాత ఎవరంటే...

By Surya PrakashFirst Published May 25, 2024, 4:54 PM IST
Highlights

ప‌వ‌న్ మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోవడానికి మ‌రింత టైమ్ ప‌ట్ట‌ే అవకాసం ఉందంటున్నారు. ఈ నేప‌థ్యంలో హ‌రీష్ మ‌రో సినిమాను సెట్ చేసుకున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ వరస పెట్టి సినిమాలు చేయటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ తో మిస్టర్  బచ్చన్ చిత్రం చేస్తున్న ఆయన పవన్ తోనూ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. అదే ఊపులో ఇప్పుడు మరో సినిమా కమిటైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్  గ్యాప్ తీసుకుని రవితేజ తో రైడ్ అనే హిందీ చిత్రాన్ని మిస్టర్ బచ్చన్ గా ,  ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ తేరీని ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గా రీమేక్ చేస్తున్నాడు. అయితే గ‌త కొంత‌కాలంగా ప‌వ‌న్ ఏపీ రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా సినిమాల‌ను ప‌క్క‌న పెట్టేశాడు. దీంతో ఈ సినిమా బాగా లేట‌యింది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ తిరిగి రీస్టార్ట్ అవ‌డానికి మ‌రింత టైమ్ ప‌డుతుందని హ‌రీష్ శంక‌ర్, ర‌వితేజ‌తో  మిస్ట‌ర్ బ‌చ్చ‌న్  ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.

ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ డేట్స్ ఇస్తే తిరిగి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ను మొద‌లు పెట్టాలి . కానీ ఏపీ ఎల‌క్ష‌న్స్ లో జ‌న‌సేన కూట‌మి గెలిచే ఛాన్సులు ఎక్కువ‌గా ఉందని, ప‌వ‌న్ మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోవడానికి మ‌రింత టైమ్ ప‌ట్ట‌ే అవకాసం ఉందంటున్నారు. ఈ నేప‌థ్యంలో హ‌రీష్ మ‌రో సినిమాను సెట్ చేసుకున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది.

ఆ హీరో మరెవరో కాదు  రామ్ పోతినేని అని తెలుస్తోంది. డ‌బుల్ ఇస్మార్ట్ త‌ర్వాత రామ్ చేయ‌బోయే సినిమా హ‌రీష్ డైరెక్ష‌న్ లోనే అని తెలుస్తోంది. మ‌రి రామ్ తో హ‌రీష్ తీయ‌బోయే సినిమా ఒరిజిన‌ల్ స్టోరీనా లేక రీమేక్ సినిమానా అన్న‌ది తెలియాల్సి ఉంది. రామ్ తో చేయ‌బోయే ఈ సినిమా హ‌రీష్ కు మ‌రింత క్రేజ్ తీసుకురాగ‌ల‌దని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని జవాన్, కృష్ణమ్మ చిత్రాలని నిర్మించిన కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
 

click me!