
క్రిందటి వారం శివరాత్రి కానుకగా రిలీజై తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా గామి.విశ్వక్ సేన్ (Vishwak Sen)ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ద్వారా విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita)డైరక్టర్ గా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్ (Chandini Chowdary). ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ (Karthik Sabareesh) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్, మేకింగ్ వీడియో వంటివి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత ..బ్రేక్ ఈవెన్ అయ్యిందో లేదో చూద్దాం.
‘గామి’కి వరల్డ్‌వైడ్‌గా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం రైట్స్ రూ.3.5 కోట్లు, సీడెడ్ రూ.1.4 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.3.5 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ సమాచారం. ఓవర్సీస్తో కలుపుకొని ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. దాదాపు ఫస్ట్ వీకెండ్ లోనే మొత్తం బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.
ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లెక్కలు చూస్తే ..
మొదటి రోజు - 02.96cr
రెండో రోజు - 01.69cr
మూడో రోజు - 01.46cr
నాలుగో రోజు - 00.51cr
ఐదో రోజు - 00.32cr
ఆరో రోజు - 00.26cr
ఏడో రోజు - 00.22cr
ఏడు రోజుల్లో
తెలంగాణా - 03.75cr
( షేర్ బ్రేక్ ఈవెన్ - 03.50cr )
రాయలసీమ - 00.98cr
( షేర్ బ్రేక్ ఈవెన్ - 01.20cr )
కోస్తాంధ్ర +ఉత్తరాంధ్ర - 02.69cr
( షేర్ బ్రేక్ ఈవెన్ - 03.50cr )
రెండు తెలుగు రాష్ట్రగాలు 7 రోజుల్లో ..
మొత్తం థియేటర్ గ్రాస్ - 13.10cr
తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో ..
మొత్తం థియేటర్ షేర్ - 07.42cr
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా ( 00.83cr )
ఓవర్ సీస్ - 02.26cr - 03.09cr ✅
( షేర్ బ్రేక్ ఈవెన్ - 02.00cr )
ప్రపంచ వ్యాప్తంగా ఏడు రోజుల్లో టోటల్ థియేటర్ గ్రాస్ - 20.05cr
ప్రపంచ వ్యాప్తంగా ఏడు రోజుల్లో టోటల్ థియేటర్ షేర్ - 10.51cr
ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ షేర్ బ్రేక్ ఈవెన్ - 11.00cr
టీజర్, ట్రైలర్ విడుదల అయ్యాక ఆ విజువల్స్ గురించి చర్చ మొదలై మంచి ఓపినింగ్స్ తెచ్చిపెట్టింది. దానికి మహాశివరాత్రి శెలవు రోజు కలొసొచ్చింది. అర్బన్ ఏరియాలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మల్టిప్లెక్స్ లలో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది.