
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) పుట్టిన రోజు ప్రత్యేకంగా సాలిడ్ అప్డేట్స్ అందాయి. తన రాబోయే చిత్రాల నుంచి ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ ఆకట్టుకుంటున్నాయి.
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అన్న అండతో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ తన టాలెంట్ తోనే ముందుకు వెళ్తున్నారు. ఏదో నామ్ కే వాస్త్ సినిమాలు చేయకుండా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో అలరిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే స్టోరీ సెలక్షన్స్ లో అన్న విజయ్ ని మించి పోతున్నాడు.
ఈ క్రమంలోనే ‘బేబీ’ (Baby MOvie) ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. దీంతో మనోడికి ఆడియెన్స్ లో మరింత క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో ఆనంద్ నుంచి తర్వాత రాబోయే చిత్రాలపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈరోజు ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు (Anand Deverakonda) పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన అప్ కమింగ్ ఫిల్మ్స్ నుంచి సాలిడ్ అప్డేట్స్ అందాయి.
నెక్ట్స్ ఆనంద్ మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు తాజాగా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఆసక్తికరమైన పోస్టర్ ను విడుదల చేశారు. ‘డ్యుయెట్’ (Duet) అనే టైటిల్ ను టీమ్ ఖరారు చేసింది. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ చాలా ఆకట్టుకుంటోంది. పట్టలేని ఆనందంలో ఉన్న ఆనంద్ జీవితంలో ఓ అమ్మాయి ఉన్నట్టు ఆ పోస్టర్ వర్ణిస్తోంది. పోస్టర్ మాత్రం ‘బేబీ’ సినిమాను బీట్ చేసేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి మిథున్ వరదరాజా కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్నానవేల్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండటం విశేషం.
అలాగే ఇప్పటికే ఆనంద్ దేవరకొండ నుంచి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రం ‘గంగం గణేశా’ (Gam Gam Ganesha) నుంచి కూడా అప్డేట్ అందింది. ఆ మధ్య వరుస పెట్టి అప్డేట్స్ వదిలిన టీమ్ మధ్యలో సైలెంట్ అయ్యింది. ఈరోజు రిలీజ్ డేట్ పై స్పందించింది. రిలీజ్ డేట్ ను పక్కాగా ప్రకటించలేదు. కానీ ఇంట్రెస్టింగ్ పోస్టర్ వదులుతూ సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.