విశ్వక్ సేన్ సక్సెస్ కోసం రూట్ మార్చాడు. ట్రెండీగా రాబోతున్నాడు. బోల్డ్ కంటెంట్‌తో `కల్ట్` మూవీని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంతో ఆయన ప్రయోగం చేయబోతున్నాడు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటడం లేదు. చాలా వరకు డిజప్పాయింట్ చేశాయి. `గామి` మంచి ప్రశంసలందుకుంది. మంచి ప్రయోగాత్మక మూవీగా నిలిచింది. కానీ కమర్షియల్‌గా ఆయనకు సక్సెస్ పడటం లేదు. ఈ క్రమంలో తనే రంగంలోకి దిగాడు. మరోసారి ప్రయోగం చేస్తున్నాడు. దర్శకుడిగా మారుతున్నాడు విశ్వక్.
గతంలో తనని తాను నిరూపించుకునేందుకు `ఫలక్‌నుమా దాస్` చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా మారారు. ఈ మూవీతో హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత నటుడిగా, అడపాదడపా నిర్మాతగా కనిపిస్తున్నారు. ఆ మధ్య `ధమ్కీ` సినిమాతో దర్శకుడిగా మరో ప్రయత్నం చేశారు. కానీ ఇది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యారు.
తానే దర్శకుడిగా, రచయితగా, హీరోగా, నిర్మాతగా మారి `కల్ట్` అనే మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం నేడు ఆదివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ మూవీ ఓపెనింగ్‌లో నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ(చినబాబు), మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొన్నారు.
ఓపెనింగ్ సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో మాస్క్ ధరించి ఉన్న ఫోటో అదిరిపోయింది. ఈ మూవీని న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారట విశ్వక్. యదార్థ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. బోల్డ్ కంటెంట్‌తో రాబోతున్నట్టు, చాలా కమర్షియల్ మీటర్లని బ్రేక్ చేసేలా ఈ మూవీ ఉంటుందని టీమ్ తెలిపింది.
ఈ రోజు ఆదివారం నుంచే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి రవి బన్సూర్ సంగీతం అందిస్తుండటం విశేషం. అలాగే సుమారు 40 మంది కొత్త వాళ్లు ఈ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారట. ఇందులో ఆర్టిస్ట్ లతోపాటు టెక్నీషియన్లు కూడా ఉండటం విశేషం.
ఈ మూవీని తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్ గ్లోబల్ ఫిల్మ్ పతాకాలపై విశ్వక్ సేన్, కరాటే రాజు, సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు తెలపడం విశేషం. మొత్తంగా `కల్ట్` మూవీతో విశ్వక్ సేన్ పెద్దగానే రిస్క్ చేస్తున్నారు. మరి కొడితే ఆయన నెక్ట్స్ లెవల్‌కి వెళ్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
❤️🔥❤️🔥 - Launched with a Grand Pooja Ceremony 🪔✨
Clap by
Camera Switch On by
Title Logo Launch by
Written and Directed by
Produced by , pic.twitter.com/iTs1Vsp34H