మంచు వారి ఫ్యామిలీ నుంచి కొత్త సింగర్లు, కూతుళ్ళను సొంత బ్యానర్ లో పరిచయం చేయబోతున్న మంచు విష్ణు,

Published : May 09, 2022, 04:57 PM IST
మంచు వారి ఫ్యామిలీ నుంచి కొత్త సింగర్లు,  కూతుళ్ళను   సొంత బ్యానర్ లో పరిచయం చేయబోతున్న మంచు విష్ణు,

సారాంశం

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. మోహన్ బాబు వారసులుగా... హీరోలు హీరోయిన్లు, నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు. ఇక మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సింగర్లు బయలుదేరారు.   

టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. మోహన్ బాబు వారసులుగా... హీరోలు హీరోయిన్లు, నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ ఉన్నారు. ఇక మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సింగర్లు బయలుదేరారు. 

డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా నటిస్తున్న గాలి నాగేశ్వరావు  సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విష్ణు. ఈ క్యారెక్టర్ అనౌన్స్ చేసినప్పటి నుంచీ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి.  పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ వంటి తారలు యాడ్ అవ్వడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. 

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తుండటం ఈ సినిమాకి మరో హైలైట్. తాజాగా మరో స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాకి యాడ్ అయ్యింది. మంచు ఫ్యామిలీ నుంచి మరో ఇద్దరు లిటిల్ స్టార్లు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు.  మంచు మోహన్ బాబు మనవరాళ్లు, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా ఈ సినిమా  పరిచయం అవుతున్నారు.  అయితే వారు నటులుగాకాకుండా సింగర్స్ గా ఈ మూవీ కి పనిచేయబోతున్నారు. 

అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడటం విశేషం. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారు. సినిమాకి కీలకంగా నిలిచే ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో విష్ణు మంచు తీసుకుంటున్న కేర్, సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేస్తున్నాయి. 

మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్