వైజాగ్ లో రామ్ చరణ్ తిప్పలు, ప్యాన్స్ నుంచి తప్పించుకోలేక...?

Published : May 09, 2022, 03:03 PM IST
వైజాగ్ లో రామ్ చరణ్ తిప్పలు, ప్యాన్స్ నుంచి తప్పించుకోలేక...?

సారాంశం

రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ మూవీ.. షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఇద్దరు కలిసి సూపర స్పీడ్ తో సినిమాను కంప్లీట్  చేస్తున్నారు. 

రామ్ చరణ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా రూపొందిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాని  దిల్ రాజు నిర్మిస్తున్నారు.  అసలే శంకర్ సినిమా అంటే రాజమౌళి టైప్ లోనే ఈయన కూడా  ఏడాదికి పైగానే చెక్కుతాడు.  కాని ఈసారిమాత్రం సూపర్ స్పీడ్ గా సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే మేజర్ షూటింగ్ అయిపోయింది. ఇక  కొద్ది రోజుల్లోనే మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట టీమ్. 

ఇంతకుముందే ఈ సినిమాకి సంబంధించిన ఓ నాలుగు షెడ్యూల్స్ ను పూర్తిచేశారు. ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలతో పాటు.. అమృత్ సర్ లో మేజర్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు మేకర్స్. ఇక  తాజాగా వైజాగ్ లో మరో షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం చకచకా కానిచ్చేస్తున్నారట.  అయితే ఈ షూటింగ్ లో రామ్ చరణ్ కు ఫ్యాన్స్ నుంచి తిప్పలు తప్పడం లేదు. 

ప్రస్తుతం వైజాగ్ లో చరణ్  కాలేజ్ కి సంబంధించిన సన్నివేశాలను .. ఆర్కే బీచ్ నేపథ్యంలో వచ్చే సీన్స్ ను .. చరణ్ కి పోలీసులతో గొడవ జరిగే సీన్ ను 3 రోజుల పాటు వైజాగ్ లో షూటింగ్ చేసినట్టు  తెలుస్తోంది. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్  వైజాగ్ లోనే కొనసాగనున్నట్టుగా సమాచారం. 

అయితే ఈ  ఆదివారం మధురవాడలో చరణ్ షూటింగ్ జరిగింది. మూడు రోజుల నుంచి ఆర్‌కే బీచ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మధురవాడలో పాత పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో కొన్ని సీన్స్ ను షూట్ చేశారు. రామ్ చరణ్ అక్కడకు వచ్చాడని తెలియడంతో చూట్టుపక్కల నుంచి భారీగా జన ఎగబడ్డారు. 

రామ్‌చరణ్‌ మధురవాడ వచ్చారనే విషయం తెలియడంతో అభిమానులు భారీగా తరిలివచ్చారు. హీరోతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. షూటింగ్‌ అనంతరం ఇక్కడకు వచ్చిన అభిమానులతో రామ్‌చరణ్‌ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. జనాన్ని కంట్రోల్ చేయడానికి టీమ్ చాలా ఇబ్బంది  పడాల్సి వచ్చింది. 

 తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈసినిమాలో కియార అద్వాని  హీరోయిన్ నటిస్తోంది. చరణ్- కియారా కంబినేషన్ లో గతంలో వినయ విధేయ రామ సినిమా రూపొందింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. శ్రీకాంత్, సునీల్, అంజలి లాంటి స్టార్స్  ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?