నెక్ట్స్ ఇయర్‌ ఉగాదికి తన తెలుగు సినిమా విడుదలవుతుందన్న విశాల్‌

Published : Feb 13, 2021, 03:11 PM IST
నెక్ట్స్ ఇయర్‌ ఉగాదికి తన  తెలుగు సినిమా విడుదలవుతుందన్న విశాల్‌

సారాంశం

నెక్ట్స్ ఇయర్‌ ఉగాదికి స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చేస్తాన`ని అంటున్నాడు హీరో విశాల్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం `చక్ర`. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా, ఎం.ఎస్‌.ఆనందన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. విశాల్‌ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది.

`నెక్ట్స్ ఇయర్‌ ఉగాదికి స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చేస్తాన`ని అంటున్నాడు హీరో విశాల్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం `చక్ర`. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా, ఎం.ఎస్‌.ఆనందన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. విశాల్‌ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. విశాల్‌, సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా కాంబినేషన్‌లో వస్తోన్న పదో చిత్రమిది. ఈ నెల 19న తమిళంతోపాటు తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.

 హీరో విశాల్ మాట్లాడుతూ, `ఈసినిమాని తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ ఈవెంట్‌కి మీడియానే గెస్ట్ అని చెప్పారు. డిజిటల్ క్రైమ్స్ నేప‌థ్యంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రమని, ఎంఎస్ ఆనంద‌న్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి సినిమా తీశారని చెప్పారు. `నా త‌మ్ముడు యువ‌న్ శంక‌ర్ రాజా ఎక్ట్రార్డిన‌రీ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నా త‌మ్ముడు వ‌రంగ‌ల్‌ శ్రీ‌ను స‌హా ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్స్ అందరూ  ఈ సినిమాతో త‌ప్ప‌కుండా ఒక జాక్ పాట్ కొడ‌తారు. ఫిబ్ర‌వ‌రి20న అంద‌రం హ్యాపీఫేస్‌తో మీట్ అవుతాం. చాలా మంది అడుగుతున్నారుస్ట్ర‌‌యిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని.. త‌ప్ప‌కుండా నెక్ట్స్ ఇయ‌ర్ ఉగాదికి  నా స్ట్ర‌యిట్ తెలుగు సినిమా విడుద‌ల‌వుతుంది` అని చెప్పారు . 

చిత్ర ద‌ర్శ‌కుడు ఎంఎస్ ఆనంద‌న్ మాట్లాడుతూ, ఎక్క‌డో ఉన్న తనని విశాల్‌ ఈ స్థాయికి తీసుకొచ్చారని, సినిమా ఇంత గొప్ప‌గా వ‌చ్చిందంటే దానికి కార‌ణం ఆయనే అని, ఒక మంచి క‌థ‌కి ఎలాంటి టెక్నీషియ‌న్స్ తోడైతే ఒక డైరెక్ట‌ర్‌కి ‌ ఫ‌స్ట్ సినిమా ప్రాప‌ర్‌గా వ‌స్తుందో అలాంటి టెక్నీషియ‌న్స్ ని ఇచ్చారు విశాల్‌ అని చెప్పాడు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వ‌ర‌కూ ప్ర‌తి సీక్వెన్స్ చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుందని, అంద‌రూ టెక్నీషియ‌న్స్ క‌థ న‌చ్చి ఈ సినిమాకి చాలా క్రియేటివ్‌గా వ‌ర్క్ చేశారు. యువ‌న్ శంక‌ర్ రాజా గారు చాలా మంచి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని తెలిపారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Harikrishna: ఆ శక్తి ఉంటే తప్పకుండా నందమూరి హరికృష్ణని బతికిస్తా.. ఎలాగో చెబుతూ కీరవాణి ఎమోషనల్ కామెంట్స్
Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌