ట్రోలర్‌కి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దీపికా పదుకొనె..

Published : Feb 13, 2021, 02:53 PM IST
ట్రోలర్‌కి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దీపికా పదుకొనె..

సారాంశం

తనపై వచ్చే అసభ్య వ్యాఖ్యలను, ట్రోల్స్ ని అస్సలు సహించరు దీపికా పదుకొనె. చాలా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తారు. తాజాగా ఓ నెటిజన్ కి అలాంటి కౌంటరే ఇచ్చింది దీపికా. తనపై వస్తోన్న ట్రోల్స్ పై ఆమె స్పందించారు. స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

తనపై వచ్చే అసభ్య వ్యాఖ్యలను, ట్రోల్స్ ని అస్సలు సహించరు దీపికా పదుకొనె. చాలా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తారు. తాజాగా ఓ నెటిజన్ కి అలాంటి కౌంటరే ఇచ్చింది దీపికా. తనపై వస్తోన్న ట్రోల్స్ పై ఆమె స్పందించారు. తనకు ఇటీవల తరచూ అసభ్య కామెంట్లు ఎదురవుతున్నాయి. వాటిని ట్రోల్‌ చేస్తున్నారు. కొంత మంది ఆకతాయిలు కావాలని దీపిని టార్గెట్‌ చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేరుగా దీపికకే మెసేజ్‌లు పెడుతున్నారు. 

దీనిపై తాజాగా దీపికా స్పందించారు. వారు పెట్టిన మెసేజ్‌లు స్క్రీన్‌ షాట్లు తీసి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. `వాహ్‌.. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు, స్నేహితులు గర్విస్తారు` అని స్ట్రాంగ్‌గా రీప్లై ఇచ్చింది దీపికా. అయితే ఆ వెంటనే ఆ ఇన్‌ స్టోరీని డిలీట్‌ చేశారు. న్యూ ఇయర్‌ సందర్బంగా తన ట్విట్టర్‌, ఇన్‌స్టా స్టోరీస్‌లోని ఫోటోలన్నీ దీపికా డిలీట్‌ చేసింది. దీపికా చివరగా మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో రూపొందిన `ఛపాక్‌`లో నటించారు. అది సక్సెస్‌ కాలేదు. ప్రస్తుతం భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి `83`లో నటిస్తుంది. దీంతోపాటు హృతిక్‌తో `ఫైటర్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే తెలుగులో ప్రభాస్‌తో నాగ్‌ అశ్విన్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: చింటూతో రోహిణీ.. రెడ్ హ్యాండెడ్ గా బాలుకి దొరికిపోయిందా..?
Karthika Deepam 2 Today Episode: దీప గురించి నిజం తెలుసుకున్న కాంచన- అడ్డంగా దొరికిపోయిన కార్తీక్