తెలుగులో విశాల్ 'టెంపర్' .. ఇది మరీ టూ మచ్?

Published : Jul 06, 2019, 03:37 PM IST
తెలుగులో విశాల్ 'టెంపర్' .. ఇది మరీ టూ మచ్?

సారాంశం

టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉండడంతో విశాల్ ప్రతిసారి స్పెషల్ కేర్ తీసుకొని మరి తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. అయితే ఈ సారి విశాల్ రిలీజ్ చేయబోయే డబ్బింగ్ సినిమాను చూస్తుంటే.. "ఇది మరీ టూ మచ్" అనే కామెంట్స్ వస్తున్నాయి. 

కోలీవుడ్ హీరో విశాల్ తన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేయకుండా ఉండలేడు. టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉండడంతో విశాల్ ప్రతిసారి స్పెషల్ కేర్ తీసుకొని మరి తెలుగు ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. అయితే ఈ సారి విశాల్ రిలీజ్ చేయబోయే డబ్బింగ్ సినిమాను చూస్తుంటే.. "ఇది మరీ టూ మచ్" అనే కామెంట్స్ వస్తున్నాయి. 

తెలుగులో ఆల్ రెడీ సక్సెస్ అయినా టెంపర్ ను తమిళ్ లో రీమేక్ చేసిన విశాల్ ఇప్పుడు అయోగ్య పేరుతోనే తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఎన్టీఆర్ లాంటి ఎనర్జిటిక్ యాక్టర్ చేసిన ఆ కథలో మరో హీరోను ఊహించుకోవడం అంటేనే కుదరని పని. అలాంటిది తెలుగులోనే మళ్ళీ దాన్ని డబ్ చేయడ అంటే.. టైమ్ వెస్ట్ చేయడమే.

తమిళ్ లో ఆ సినిమా బాగానే ఆడింది కదా అని మళ్ళీ తెలుగులో కూడా సక్సెస్ అవుతుంది అని రిలీజ్ చేయడం నిజంగా ఒక ప్రయోగమనే చెప్పాలి. మరి ఈ ప్రయోగంతో విశాల్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూద్దాం. ఈ నెల 12న అయోగ్య రెండు తెలుగు స్టేట్స్ లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

PREV
click me!

Recommended Stories

'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'
Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌