ప్రముఖ విప్లవ దర్శకుడికి మాతృ వియోగం

Published : Jul 06, 2019, 03:15 PM IST
ప్రముఖ విప్లవ దర్శకుడికి మాతృ వియోగం

సారాంశం

నేను సైతం - ఎర్ర మల్లెలు - యువతరం కదిలింది వంటి విప్లవ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

నేను సైతం - ఎర్ర మల్లెలు - యువతరం కదిలింది వంటి విప్లవ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన  తల్లి ధవళ సరస్వతి(86) ఈ రోజు ఉదయం నర్సాపూర్ లో తుది శ్వాస విడిచారు. దర్శకుడు ధవళ సత్యం ఆమె పెద్ద కుమారుడు. 

రెండవ కుమారుడు  ధవళ చిన్నారావు చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక మూడవ కుమారుడు ధవళ మల్లిక్ దర్శకుడిగానూ చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు లక్ష్మీ నరసింహారావు నర్సాపూర్ కాలేజీలో తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్నారు.

సినీ ప్రముఖులు పలువురు రాజకీయ ప్రముఖులు ధవళ సత్యంను కలుసుకొని పరామర్శించారు. నేడు మా తల్లి అంత్యక్రియలు  నర్సాపూర్ లో జరుగుతాయని ధవళ సత్యం మీడియాకు వివరణ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్