
స్టార్ హీరోలందరు ఏడాదికో సినిమా చేయడానికే చాలా ఆలోచిస్తుండగా విశాల్ మాత్రం ఒక ఏడాదిలో మినిమమ్ రెండు సినిమాలు అయినా రిలీజ్ చేయాల్సిందే అంటున్నాడు. ఒక ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే రెండు కథలను లైన్ లో పెట్టడం ఈ హీరోకి అలవాటే. ఇకపోతే ఇదివరకే పందెం కోడి సీక్వెల్ తో మెప్పించిన విశాల్ ఇప్పుడు మరో రెండు సీక్వెల్స్ తో సిద్దమవుతున్నాడు.
అభిమన్యుడు (ఇరుంబు తిరై) కథకు కొనసాగింపుగా మరో సినిమాను ఇటీవల ఒకే చేసిన విశాల్ డిటెక్టీవ్ (తుప్పరివలాన్) సీక్వెల్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మిస్కిన్ డైరెక్షన్ లో త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ప్రస్తుతం విశాల్ టెంపర్ రీమేక్ అయోగ్య రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
అయోగ్య సినిమాపై కోలీవుడ్ లో ఇప్పుడు పాజిటివ్ బజ్ నెలకొంది. ఎన్టీఆర్ రేంజ్ లో కాకపోయినా విశాల్ తనదైన శైలిలో లుక్స్ తో అదరగొడుతున్నాడని టీజర్ అండ్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.