''పరుచూరి భార్యను చంపాలని కత్తి కూడా కొన్నా..''

By Udaya DFirst Published 16, Apr 2019, 2:41 PM IST
Highlights

పోసాని కృష్ణమురళి రచయితగా, నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 

పోసాని కృష్ణమురళి రచయితగా, నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ భార్యపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ.. పరుచూరి భార్యని చంపాలని అప్పట్లో కత్తి కొన్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు షాక్ కి గురిచేశాయి. పోసాని కృష్ణమురళి కెరీర్ ఆరంభంలో పరుచూరి బ్రదర్స్ తో వద్ద శిష్యరికం చేశారు. వాళ్లతో కలిసి చాలా సినిమాలకు పని చేశారు.

అయితే పరుచూరి భార్యకి పోసాని గురించి ఎవరో ఏవో కల్పించి చెప్పడంతో ఆమె పోసానిని దూరం పెట్టారట. సరిగ్గా ట్రీట్ చేయకపోవడంతో పోసానికి విపరీతమైన కోపం వచ్చేదట. ఎంతగా అంటే.. ఆమెను పొడవడానికి అప్పట్లో ఓ కత్తి కూడా కొన్నారట. ఈ విషయాలను పోసాని గతంలో కూడా చెప్పారు. 

అయితే ఆ తరువాత అది తలచుకొని సిగ్గు పడినట్లు, చాలా కుమిలిపోయినట్లు చెప్పుకొచ్చాడు. తను ఎవరో తెలియకపోయినా.. పరుచూరి బ్రదర్స్ శిష్యుడిగా పెట్టుకొని లైఫ్ ఇచ్చారని, అలాంటిది వారేదో చిన్న మాట అన్నారని బయటకి వచ్చేసి, పరుచూరి భార్యని చంపాలనే ఆలోచన చేయడం తన తప్పని ఒప్పుకున్నారు. 

Last Updated 16, Apr 2019, 2:41 PM IST