అందరిముందు 'అన్నా' అని పిలిచిన హీరోయిన్.. షాక్ లో నాని!

By Udaya DFirst Published 16, Apr 2019, 2:22 PM IST
Highlights

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం 'జెర్సీ'. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. 

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం 'జెర్సీ'. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. దీనికోసం హీరోయిన్ శ్రద్ధా తెలుగులో స్పీచ్ సిద్ధం చేసుకొని తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ శ్రద్ధా ఎంతో బాగా తెలుగు నేర్చుకొని మరీ మాట్లాడడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో ఆమె అభిమానులను ఉత్సాహపరిచేందుకు 'జై నాని అన్నా' అని అనడంతో అందరూ షాక్ అయ్యారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎవరూ కూడా హీరోలను అన్న అని వరుసలు పెట్టి పిలవరు. అలా పిలిచిన సందర్భాలు కూడా పెద్దగా కనిపించవు.

అలాంటిది శ్రద్ధా.. నానిని అన్న అనడంతో అభిమానులతో పాటు నాని కూడా షాక్ అయ్యాడు. దర్శకుడు గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సెన్సార్ 'యు' సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాలో నాని 36 ఏళ్ల క్రికెటర్ గా కనిపించనున్నాడు. 

Last Updated 16, Apr 2019, 2:22 PM IST