తారక్ - చరణ్ కు కుదరదని మొహం మీదే చెప్పేశాం: హీరో విశాల్

Published : Sep 30, 2018, 10:17 AM IST
తారక్ - చరణ్ కు కుదరదని మొహం మీదే చెప్పేశాం: హీరో విశాల్

సారాంశం

ఈ రోజుల్లో ఎక్కువగా డబ్ చేస్తున్నారు. కుదిరిన ప్రతిచోట ఒక మార్కెట్ సెట్ చేసుకోవాలని ఆశపడుతున్నారు. అందుకు కోలీవుడ్ హీరోలు మంచి ఉదాహరణ అని చెప్పాలి. టాలీవుడ్ లో తమిళ్ హీరోలకు ఏ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో అందరికి తెలిసిందే. 

ఒక భాషలో హిట్టయిన సినిమాలు మరొక భాషలో రీమేక్ అవ్వడం కామన్. అయితే ఈ రోజుల్లో ఎక్కువగా డబ్ చేస్తున్నారు. కుదిరిన ప్రతిచోట ఒక మార్కెట్ సెట్ చేసుకోవాలని ఆశపడుతున్నారు. అందుకు కోలీవుడ్ హీరోలు మంచి ఉదాహరణ అని చెప్పాలి. టాలీవుడ్ లో తమిళ్ హీరోలకు ఏ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో అందరికి తెలిసిందే. 

అందులో విశాల్ తెలుగు వారికి చాలా స్పీడ్ గా దగ్గరయ్యాడని చెప్పాలి. అసలు విషయంలోకి వస్తే తమిళ్ తో పాటు తెలుగులో కూడా విశాల్ కి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం పందెం కోడి. ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విశాల్ కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది. అయితే ఇప్పుడు ఆ కథకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ట్రైలర్ లాంచ్ కూడా చేశారు. 

ఈ సందర్బంగా విశాల్ ఒక విషయాన్నీ చెప్పాడు. మొదట పందెంకోడి సినిమా తమిళ్ లో హిట్ అవ్వగానే చాలా మంచి తెలుగు హీరోలు తెలుగు రైట్స్ కోసం ఎగబడ్డారట. రామ్ చరణ్ - తారక్ లాంటి హీరోలు కూడా అందులో ఉన్నారు. అయితే విశాల్ తండ్రి జీకే.రెడ్డి తెలుగు రైట్స్ అమ్మడానికి ఇష్టపడలేదట. డైరెక్ట్ గా బడా హీరోల మొహం మీదే నేను సినిమా హక్కులను అమ్మనని క్లారిటీ ఇచ్చారట. తెలుగులో కూడా తన కొడుకు మంచి హీరో అవ్వాలని అప్పట్లో వారు నిర్ణయించుకున్నట్లు విశాల్ వివరించారు. 

PREV
click me!

Recommended Stories

Boyapati Sreenu: చిరంజీవితో బోయపాటి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా ? బాలకృష్ణ అఖండ వల్ల అంత జరిగిందా..
నా కూతురు చిన్న పిల్ల... మీరు రాసే వార్తలు చదివితే తట్టుకోగలదా? స్టార్ హీరో ఎమోషనల్