బిగ్ బాస్2: కౌశల్ చేతిలో బిగ్ బాస్ ట్రోఫీ..

Published : Sep 29, 2018, 04:55 PM ISTUpdated : Sep 29, 2018, 04:56 PM IST
బిగ్ బాస్2: కౌశల్ చేతిలో బిగ్ బాస్ ట్రోఫీ..

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 రేపటితో ముగియనుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్స్ కి చేరుకున్నారు. వారే కౌశల్, దీప్తి నల్లమోతు, గీతామాధురి, తనీష్, సామ్రాట్. ఈ ఐదుగురిలో బిగ్ బాస్ విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. 

బిగ్ బాస్ సీజన్ 2 రేపటితో ముగియనుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షోలో ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్స్ కి చేరుకున్నారు. వారే కౌశల్, దీప్తి నల్లమోతు, గీతామాధురి, తనీష్, సామ్రాట్.

ఈ ఐదుగురిలో బిగ్ బాస్ విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అందరూ ముక్తకంఠంతో కౌశల్ పేరు చెబుతుంటే.. కౌశల్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటింగ్ ద్వారా విజేతను ప్రకటించనున్నారు.

ఎన్నడూ లేని విధంగా ఈసారి మొత్తం పాతిక కోట్ల ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. అందులో ఎక్కువ శాతం కౌశల్ కే వచ్చినట్లు సమాచారం. ఆ తరువాతి స్థానంలో దీప్తి ఉండగా గీతామాధురి మూడో స్థానం దక్కించుకుందని టాక్. తనీష్, సామ్రాట్ లు ఓటింగ్ లో చివరి స్థానాల్లో ఉన్నారు.

అయితే కౌశల్ విజేత అని చెప్పడానికి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో దర్శనమిస్తోంది. ఇక కౌశల్ చేతిలో ట్రోఫీ కనిపించడంతో ఆయనే విజేత అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. రేపు దీనిపై అధికార ప్రకటన రానుంది!

PREV
click me!

Recommended Stories

Rajinikanth : 75 ఏళ్ల వయసులో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు
Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద