
విరూపాక్ష చిత్రంతో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం కావడంతో విరూపాక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠకి తెరదించుతూ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే విరూపాక్ష చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి.
ఈవెనింగ్ షోలో వచ్చేసరికి ఈ టాక్ బ్లాక్ బస్టర్ గా మారింది. తొలి రోజు ఈ చిత్రం 12 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. రెండవరోజు అంతే సాలిడ్ గా అన్ని ప్రాంతాల్లో షోలు రన్ అవుతున్నాయి. దర్శకుడు కార్తీక్ దండు వణుకు పుట్టించే మిస్టరీ థ్రిల్లర్ కథతో అదరగొట్టేశారు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటన అద్భుతంగా ఉంది. సినిమా ఆద్యంతం సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసే విధంగా సాగుతుంది. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలకు ప్రధాన బలం కథలో ఊహించని విధంగా వచ్చే మలుపులు, నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటూ మైంటైన్ అయ్యే సస్పెన్స్.. ఈ రెండు అంశాల్లో విరూపాక్ష చిత్రం ప్రేక్షకుల అంచనాలని 100 శాతం అందుకుంది.
ఇలాంటి చిత్రాలకు ట్విస్టులే కీలకం కాబట్టి చిత్ర యూనిట్ అలెర్ట్ అయింది. కొందరు సినిమా చూసిన వాళ్ళు.. సోషల్ మీడియాలో కీలకమైన ట్విస్ట్ లు రివీల్ చేస్తూ స్పాయిల్ చేస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన విరూపాక్ష చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేయాలి. దయచేసి ట్విస్ట్ లు లీక్ చేసి ఎక్స్పీరియన్స్ ని పాడు చేయకండి. మిగిలిన వాళ్ళని కూడా ట్విస్టులతో అనుభూతి చెందనివ్వండి అని విరూపాక్ష టీం రిక్వస్ట్ చేసింది.
దర్శకుడు కార్తీక్ దండు ఏమాత్రం ఊహకి కూడా అందని విధంగా కొన్ని అద్భుతమైన ట్విస్టులు పెట్టారు. అలాగే ఆడియన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడి సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి. కొందరు నెటిజన్లు అలాంటి సన్నివేశాల గురించి పోస్ట్ లు పెడుతూ అనుభూతి చెడగొడుతున్నారు.
ఏది ఏమైనా విరూపాక్ష టీం ప్రస్తుతం ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. సాయిధరమ్ తేజ్, కార్తీక్ దండు, సంయుక్త మీనన్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ పార్టీ మూడ్ లో ఉన్నారు.