virata parvam : విరాట పర్వం ఈవెంట్‌లో గాలి దుమారం బీభత్సం.. కూలిన వేదిక

Siva Kodati |  
Published : Jun 05, 2022, 08:19 PM ISTUpdated : Jun 05, 2022, 08:24 PM IST
virata parvam : విరాట పర్వం ఈవెంట్‌లో గాలి దుమారం బీభత్సం.. కూలిన వేదిక

సారాంశం

కర్నూలు జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. దీని కారణంగా దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వం మూవీ టీజర్ లాంచింగ్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈదురు గాలుల ధాటికి వేదికతో పాటు పక్కనే వున్న డిజిటల్ స్క్రీన్ కూలిపోయింది. 

దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వం మూవీ టీజర్ లాంచింగ్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం కర్నూలులో జరుగుతుండగా గాలి దుమారం రేగింది. బలమైన ఈదురుగాలులకు వేదికతో పాటు డిజిటల్ స్క్రీన్ కూలిపోయింది. దీంతో నిర్వాహకులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రానా, సాయిపల్లవి వేదికపైకి రాకముందే ఈ ఘటన జరగింది. ఈ ఘటనకు సంబంధించిన  మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం...దాదాపు మూడేళ్ల నిరీక్షణ తరువాత జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వబోతోంది. ఇందులో రానా, ప్రియమణి నక్సలైట్ గా కనిపించబోతున్నారు. పోస్టర్స్ .. స్పెషల్  వీడియోస్ తో సందడి చేస్తున్న ఈసినిమా నుంచి సాలిడ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ ట్రైలర్ లో నట విశ్వరూపంచూపించారు ఇద్దరు. 

ఇక రీసెంట్ గా  డైరెక్టర్ వేణు, హీరో  రానా ఈ సినిమాలో సాయి పల్లవి మెయిన్ లీడ్ అని, సాయి పల్లవి విశ్వరూపం చూస్తారని సాయి పల్లవి గురించి ఓ రేంజ్ లో చెప్పారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా వాళ్ళు చెప్పింది కరక్టే అనిపిస్తుంది. సాయి పల్లవి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ లో రానా భావాలు, అతను రాసిన పుస్తకాలు నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. అతన్ని కలవడానికి ఇల్లు వదిలి వెళ్తుంది. నక్సలైట్ లతో సంబంధాలు ఉన్నాయని ఆమెని పోలీసులు చిత్ర హింసలు పెడతారు. చివరికి రానాకి తన ప్రేమ అర్థమయ్యేలా చెప్పి సాయి పల్లవి కూడా నక్సలైట్ గా మారుతుంది. 

ALso Read:Virataparvam trailer: నటవిశ్వరూపం చూపించిన రానా, సాయిపల్లవి, విరాటపర్వం ట్రైయిలర్ రిలీజ్

పుస్తకం రాసినోడును చూడాలనుందంటూ అమ్మవారి దగ్గర మొద పెట్టుకుంటుంది హీరోయిన్‌. అలా అడిగిందో రవన్న దళం ఊర్లో దిగుతుంది. అందులో లీడర్‌ రానాను చూసి మురిసిపోయింది సాయి. అంతేకాదు, ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తిని పొందడం కోసం తాను కూడా నక్సలైట్‌గా మారుతుంది. కానీ ప్రజాసేవలో మునిగిపోయిన హీరోకు ప్రేమ అంటే గిట్టనట్లే కనిపిస్తున్నాడు. మరి అతడు వెన్నెల ప్రేమను అర్థం చేసుకుంటాడా? వీరి ప్రేమ ఏ తీరాన్ని చేరిందనేది ఆసక్తికరంగా మారింది. నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతలో మాత్రం కచ్చితంగా నేనే ఉన్నా, ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది అన్న డైలాగ్స్‌ బాగున్నాయి. 

ఇలా సింపుల్ గా చెప్పినా..  ఆల్మోస్ట్ సగం కథని ట్రైలర్ లోనే చూపించారు మేకర్స్. అయితే కథ మొత్తం సాయి పల్లవి కోణంలోంచి ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.   పుట్టినప్పుడు అమ్మ కడుపులోనుంచే లాంటి అద్భఉతమైన డైలాగ్స్ పేలాయి ట్రైలర్ లో  వీటితో పాటు ప్రేమ గురించి, యుద్ధం గురించి చాలా డైలాగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది.  ఇక ట్రైలర్ లోనే సాయిపల్లవి నట విశ్వరూపం చూపించింది. రానా, ప్రియమణి, నవీన్ చంద్ర కూడా నక్సలైట్స్ గా అదరగొట్టారు. ట్రైలర్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు